యువశక్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: ఆరెల్లి కృష్ణ

నూజివీడు: జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరుగుతున్న కార్యక్రమంలో యువత పాల్గొని జయప్రదం చేయాలని చాట్రాయి మండలం కృష్ణారావు పాలెం గ్రామంలో యువశక్తి పోస్టర్ని రిలీజ్ చేసి నియోజకవర్గ యువతను కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి మట్ట ఉమామహేశ్వరి, చాట్రాయి మండల అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, చాట్రాయి మండల ప్రధాన కార్యదర్శి మొండ్రు సురేష్, కార్యదర్శి మిద్దె హరీష్, చనుబండ గ్రామ నాయకులు గొల్లమందల వెంకటేశ్వరరావు, విషంపల్లి ప్రసాద్ రావు, కారుమంచి బిక్షాలు, మొండ్రు తేజ, మోదుగు రవీంద్ర, డిజె సతీష్, గొల్లమందల రవి, సతీష్, కృష్ణారావు పాలెం గ్రామ నాయకులు ఆనంద్, చార్లెస్, లక్ష్మణరావు(లక్కీ) మరియు జన సైనికులు పాల్గొన్నారు.