ఐఐసీటీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ).. జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18

పోస్టుల వివరాలు: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జనరల్‌)-08, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌)-05, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఎస్‌ అండ్‌ పీ)-05.

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(జనరల్‌): అర్హత: ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.29,000 చెల్లిస్తారు.

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): అర్హత: అకౌంటెన్సీ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.29,000 చెల్లిస్తారు.

 జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(ఎస్‌ అండ్‌ పీ): అర్హత: ఇంటర్మీడియట్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ టైపింగ్‌లో ప్రొఫిషియన్సీ ఉండాలి. వయసు: 28ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.29,000 చెల్లిస్తారు.

 ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, టైప్‌ రైటింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిక్రూట్‌మెంట్‌ సెక్షన్, సీఎస్‌ఐఆర్‌ ఐఐసీటీ, ఉప్పల్‌ రోడ్, తార్నాక, హైదరాబాద్‌ -500007 చిరునామాకు పంపించాలి.

 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 08.08.2021

 దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 23.08.2021

 వెబ్‌సైట్‌: https://iictindia.org