ITI Limited ఉద్యోగాల ప్రకటన విడుదల

భార‌త ప్ర‌భుత్వ టెలీ క‌మ్యూనికేష‌న్స్ విభాగానికి చెందిన బెంగ‌ళూరులోని ఐటీఐ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 31 పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 2020 దరఖాస్తుకు చివరితేది. ఆగస్టు 26, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 31

ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌ – 2

జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ – 4

డీజీఎం – 8

మేనేజ‌ర్‌ – 12

డిప్యూటీ మేనేజ‌ర్‌ – 4

మెడికల్‌ సర్వీసెస్‌ – 1

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్, ఎంబీబీఎస్+పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు నిర్దిష్ట అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: స‌్కిల్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఆగస్టు 26, 2020

ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రి తేది: సెప్టెంబర్‌ 02, 2020

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.itiltd.in/ ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు పంపడానికి చిరునామా: ADDL. GENERAL MANAGER-HR, ITI LIMITED,ITI BHAVAN, DOORAVANI NAGAR, BENGALURU – 560016.