జోగి – ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు: ఎస్.వి.బాబు

  • శుభకార్య ప్రారంభానికి ముందు వినాయకుడిని స్మరించుకోవడం, వైసిపి సభల్లో మంత్రులు పవన నామ జపం చేయటం సర్వసాధారణం

పెడన, శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో తాడేపల్లి ప్యాలెస్ తాభెదారైన జోగి రమేష్ పవన్ కళ్యాణ్ మీద నోరు పరేసుకోవడం జరిగింది. 30 కోట్ల రూపాయల తన సొంత కష్టార్జితాన్ని కౌలు రైతులకు ఉదారంగా ఆర్థిక సహాయం చేస్తున్న దాన కర్ణుడు పవన్ కళ్యాణ్. నువ్వు ఒక మట్టి దొంగవి. మీ యజమాని సీ.బి.ఐ దత్తపుత్రుడు. ప్రజలకు మీరిస్తున్న పథకాలు మీ సొంత జేబులో డబ్బు కాదు. ప్రజల డబ్బులు ప్రజలకు పంచుతూ మీ సొంత ఇంట్లోంచిస్తున్నట్టు బిల్డప్పులు ఆపు జోగి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, అమరావతిని ఒక కుల రాజధానిగా చిత్రీకరిస్తూ అమరావతిపై విషని చిమ్ముతున్న మీ విష సంస్కృతిని ఆంధ్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. తమ విలువైన భూమినిచ్చి దిక్కు తోచని స్థితిలో రోడ్లపై పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతుల ఉసురు మీకు తగులుతుంది. జోగి రమేష్ కి దమ్ము ధైర్యం ఉంటే నియోజకవర్గ సమస్యలపై, తాను చేసిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలి. మీ యజమానికి భజన చేయటం ఆపి నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టి జోగి. జోగి రమేష్ కి సిగ్గు ఉంటే ఈ కింది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి

♦️ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజులొ సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చారు. ఎందుకు రద్దు చేయలేదు?
♦️ దశలవారుగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. ఎందుకు చేయలేదు?
♦️ మీ యజమాని అమ్మ, విజయమ్మ మీ పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి ఎందుకు రాజీనామా చేసింది సమాధానం చెప్పగలరా?
♦️ జగనన్న వదిలిన బాణం షర్మిల పక్క రాష్ట్రానికి వెళ్లి ఎందుకు పార్టీ పెట్టింది? మీ దగ్గర సమాధానం ఉందా?
♦️ వచ్చే ఎన్నికల్లో పెడన నుండే నేను పోటీ చేస్తానని చెప్పగలవా?
♦️ కోడి కత్తి కేసు ఎక్కడ వరకు వచ్చింది. వివరించగలవా?
♦️ బాబాయి గొడ్డలి పోటు సిబిఐ దర్యాప్తు ఏమయ్యింది. నీ దగ్గర సమాధానం ఉందా?
♦️ అక్క చెల్లెమ్మలకు 30 లక్షల ఇల్లు కేటాయించామని డబ్బా కొడుతుంటారు కదా. నీ పదవీకాలంలో ఎన్ని ఇల్లు కట్టగలవొ చెప్పగలవా?
♦️ కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తానన్నారు. ఇప్పటివరకు ఎన్ని నిధులు కేటాయించారు శ్వేత పత్రం విడుదల చేసే దమ్ము మీకుందా?
♦️ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మీ ప్రభుత్వం వచ్చాక ఏమి ఓరగా పెట్టారో బహిరంగ చర్చకు సిద్ధమా?
పై ప్రశ్నలకు సమాధానం చెప్పి, చెప్పలేని ఎడల అన్ని మూసుకొని కూర్చోండి.
నీ కన్నా ముందు ఇలాగే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన బీహారొడి స్క్రిప్టులు చదివి, చదివి చతికెలపడి ఇప్పుడు ఇంట్లో కూర్చుని చెక్కభజన చేస్తున్నారు. భవిష్యత్తులో నీ పరిస్థితి అదే జోగి అంది పెడన జనసేన నాయకులు ఎస్.వి.బాబు హెచ్చరించారు.