జోహార్ జోహార్ బాబు జగ్జీవన్ రామ్ జోహార్

పిఠాపురం నియోజకవర్గ దళిత నాయకులు మరియు రూరల్ మండల జనసేన నాయకులు అయిన వాకపల్లి సూర్యప్రకాష్ పలుచోట్ల జాతి నేత బాబూజీ జయంతి ఉత్సవాలలో పాల్గొనడం జరిగినది. మొదటగా జల్లూరు గ్రామంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు వెన్నా జగదీష్ అధ్యక్షతన ఉత్సవాలకు హాజరై మహనీయుని విగ్రహానికి పూలమాల ఆవిష్కరించి ఘనమైన నివాళులు తెలిపి కేక్ కటింగ్ మరియు స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. అనంతరం పిఠాపురం పట్టణ జగ్జీవన్ నగర్ నందు టౌన్ జనసేన నాయకులు టైల్స్ బాబీ సమక్షంలో మహనీయులు బాబూజీ విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనమైన నివాళులు తెలపడంతో పాటుగా స్థానిక దళిత యువ క్రీడాకారులకు వాలీబాల్ కిట్ బహుకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండల రూరల్ నాయకులైన పిల్లా వెంకట దినేష్, తమ్మనబోయిన సుదర్శన్ మరియు గంజి గోవిందరాజు పాల్గొనడం జరిగింది.