గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన పదవరోజు

  • విద్యార్ధులకు పుస్తకాల పంపిణీ

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం, బొడ్లపాడు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా పదవ రోజు బొడ్లపాడు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు అన్ను రామకృష్ణ కుమార్తె అన్ను చరణ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన జానీ, మత్స పుండరీకం, కర్ణేన సాయిపవన్ లు విద్యార్థులకు పేడ్స్, బుక్స్, పెన్సిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ ఇటువంటి విద్యార్థులు భవిష్యత్ బాగుండాలని, విద్యార్థి దశ నుండే, ప్రశ్నించే తత్వం, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని కోరారు. మీ బంగారు భవిష్యత్తు కోసం జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. మత్స పుండరీకం మాట్లాడుతూ… నేటి బాలలే రేపటి పౌరులు అన్న మాటకు తగ్గట్టుగా విద్యార్థులు బాగా చదువుకోవడం, వివిధ క్రీడలు ఆడాలి, తెలియని నేర్చుకోవాలి, విద్యార్థిగా మీ మీ బాధ్యతలు సరిగ్గా నిర్వహించాలి అప్పుడే ఉత్తమ పౌరులుగా గుర్తించబడతారు. పవన్ కళ్యాణ్ ఎంతో మంది అనాధ పిల్లలను, నిరుపేదలను అదుకుంటున్నారని తెలిపారు. కర్ణేన సాయి పవన్ మాట్లాడుతూ నేటి యువత, విద్యార్థులు పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకుని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారిని జనసేన పార్టీ తరుపున అదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్లపాడు గ్రామ యువత, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.