‘బీస్ట్’తో జానీ మాస్టర్ బర్త్ డే సెలెబ్రేషన్స్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నిన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. దక్షిణాదిలో ఈ కొరియోగ్రాఫర్ కు మంచి పేరు ఉంది. దాదాపు సౌత్ లోని అగ్ర హీరోలందరితో తనదైన శైలిలో స్టెప్పులు వేయించాడు. అయితే ఇప్పుడు అతను కూడా హీరోగా మారిపోయాడు. జానీ మాస్టర్ బర్త్ డే సందర్భంగా నిన్న ఆయన హీరోగా నటిస్తున్న రెండు చిత్రాలను ప్రకటించారు. అందులో ఒకటి “జే1”. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇది జానీ మాస్టర్ తొలి చిత్రం. రెండవ చిత్రం. జానీ మాస్టర్ హీరోగా ఓషో తులసీరామ్ దర్శకత్వంలో వహిస్తున్న మూవీ ‘దక్షిణ’. అయితే జానీ ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడు. తలపతి విజయ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న “బీస్ట్” మూవీ సాంగ్ షూట్ లో బిజీగా ఉన్నాడు. కాగా నిన్న జానీ మాస్టర్ పుట్టినరోజు కావడంతో యూనిట్, విజయ్ స్వయంగా జానీకి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. సెట్లో ఆయన బర్త్ డే సెలబ్రేషన్ నిర్వహించి జానీని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మాస్ పాటలు, మెలోడీలు. ఈ ఏ సాంగ్స్ అయినా జానీ కొరియోగ్రఫీ చేస్తే విజిల్స్ వేయాల్సిందే. ‘ఖైదీ నంబర్ 150’లో ‘సుందరి.’, ‘రంగస్థలం’లో ‘జిల్ జిల్ జిగేలు రాణి’, ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘బుట్టబొమ్మ.’, ‘ఇస్మార్ట్ శంకర్’లో టైటిల్ సాంగ్, ‘రెడ్’లో ‘డించక్. డించక్’, ‘భీష్మ’లో ‘వాట్టే వాట్టే బ్యూటీ’, ధనుష్ చిత్రం ‘మారి-2’ లో ‘రౌడీ బేబీ’ పాటలకు ఆయనే కొరియోగ్రఫీ అందించారు. ఇటీవల ‘రాధే’లో ‘సిటీమార్.’ పాటతో సల్మాన్ అభిమానులు, ఉత్తరాది ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు. అలాగే పలు తెలుగు, తమిళ , కన్నడ స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.