జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులు చేగొండి సూర్యప్రకాష్ కి సన్మాన కార్యక్రమం

జనసేన పార్టీ పి.ఎ.సి సభ్యులుగా చేగొండి సూర్యప్రకాష్ ని నియమించిన కారణంగా శనివారం ఉదయం యాతం నగేష్ ఆఫీసులో దుర్గా శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేగొండి సూర్యప్రకాష్ కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేగొండి సూర్యప్రకాష్ మాట్లాడుతూ… మనం అందరం ప్రతిరోజు ఒక గంట సమయం జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు నాకు పదవి ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు అంతో కృతజ్ఞతతో పార్టీ కోసం కష్టపడతానని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన యాతం నగేష్, దుర్గా శ్రీనివాస్, పంతం పవన్ లకు మరియు విచ్చేసిన అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంతం పవన్, దుర్గా శ్రీనివాస్, కొల్ల శంకర్, నాగేంద్ర, మహేష్, వెంకటేశ్వరరావు, గిడుగు కిరణ్, నవీన్, వెంకట్, చందు మరియు జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.