గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరికలు

నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకర్గంలో, బుచ్చిరెడ్డి పాలెం, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన 50 మంది యువకులు మరియు స్థానిక కార్యకర్తల ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీకి మంచి ఆదరణ ఉంది, రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే అని అందరూ నమ్ముతున్నారు. కార్యకర్తలంతా కూడా క్రమశిక్షణ, నిబద్ధతతో వ్యవహరించాలి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైనా కూడా దానికి కట్టుబడి జనసేన పార్టీని మీరందరూ గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై మండల అధ్యక్షుడు సాయంతో పోరాడాలి, బాధితులకు న్యాయం కల్పించే క్రమంలో జిల్లా యంత్రాంగం, లీగల్ కమిటీ తోడుగా ఉంటారు. గత ఎన్నికల్లో కూడా స్వచ్ఛందంగా బుచ్చిరెడ్డిపాలెం నుంచి జనసేన పార్టీకి మద్దతు లభించింది. జనసేన కార్యకర్తలు నాయకులంతా కూడా జనసేన పార్టీ మీద ఉన్న అభిమానాన్ని, ఓటు బూతులు దాకా తీసుకెళ్లి ఓటు వేయించేటట్లు కృషి చేయాలి. గడిచిన 4 నెలల్లో వైసీపీ సాధించిన అభివృద్ధి శూన్యం. ఇసుక దందా ఎక్కువైపోయింది, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వైసిపి నాయకులు కోట్లు వెనకేసుకుంటున్నారే గాని స్థానిక ప్రజలకు విద్యా ఉపాధి కల్పనలో విఫలమయ్యారు. గ్రామాల కనెక్టివిటీ రోడ్లు అద్వాన్నంగా ఉన్నా, అకాల వర్షాలకు కష్టపడిన రైతులకు పరిహారం లేక అల్లాడుతున్న వాటిని పట్టించుకునే వారే లేరు. రానున్నది ప్రజా ప్రభుత్వం జనసేన ప్రభుత్వం మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆశయాలకు జనసేన పార్టీ సిద్ధాంతాలకు వారదులుగా వ్యవహరించి జనాలకు చేరువై పార్టీని గెలిపించాలి. ఈ కార్యక్రమంలో కిషోర్ తో సాయి, షారు, కాషిఫ్, షాజహాన్, రుషి, షామీర్, నవీన్, ప్రసాద్, ప్రశాంత్ గౌడ్, హేమచంద్ర యాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.