రాజానగరంలో వైసిపి నుండి జనసేనలోకి చేరికలు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కణుపూరు గ్రామం నుండి ఎస్సి సామాజిక వర్గానికి చెందిన 30 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి, జనసేన పార్టీ రాజకీయ ప్రయాణానికి ఆకర్షితులై జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరికీ బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కొత్తగా జాయిన్ అయిన వారిలో, మంచాల సామ్యూల్, వనపర్తి రాజు, ముప్పిడి ప్రసాదు, నాగరాజు, జీవన్, ప్రసన్న సూరిబాబు, మహేష్, బాబి, గల్లా వెంకట లక్ష్మీ మొదలగు 30 మంది వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్రి దొరబాబు, సూరిశెట్టి వెంకన్న బాబు, గల్లా నాగు, వీర భద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.