పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్

  • సెంటు భూమి పథకంలో 0 మార్కులు కొట్టేసిన స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.
    • వెలగలేరులో కేటాయించిన ప్లాట్లు పోలవరం బుడవేరు ముంపు గురయ్యే ప్రాంతం
    • ఇళ్ల నిర్మాణ పథకం వైసిపి రాష్ట్ర ప్రభుత్వ పథకం కాదు ఇది పి.ఎం.ఏ.వై కేంద్ర ప్రభుత్వ పథకమే.
    • టిడ్కో ఇళ్ళు ఎప్పటికి పూర్తి చేస్తారు ?
    • విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కేటాయించిన 10468 ఇళ్లకు గాను కేవలం 74 ఇల్లు మాత్రమే ఈ సంవత్సరం చివరికి పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్న గొప్ప ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు మార్కులు సున్నా అనడంలో సందేహం ఏమన్నా ఉందా?

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, జగనన్న ఇల్లు పేదల కన్నీళ్లు, జగనన్న మోసం సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సర్కిల్ 1 కార్యాలయంలో జోనల్ కమిషనర్ సుధాకర్ ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. అనంతరం మహేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గానికి సెంటు భూమి పథకం కింద కేటాయించిన ఇల్లు 10468, ఇప్పటివరకు లబ్ధిదారులకు చూపించిన ప్లాట్లు 2083, లబ్ధిదారులకు చూపించని కేటాయించని ప్లాట్లు 8385. డిసెంబర్. 31. 2022 నాటికి కేటాయించిన 2083 పట్టాలలో వెలగలేరులో 74 ఇల్లు మాత్రమే పూర్తి చేయించి లబ్ధిదారులకు అందజేయాలనే టార్గెట్ పెట్టుకున్నారని అధికారులు తెలియజేస్తున్నారని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కేటాయించిన 10468 ఇళ్లకు గాను కేవలం 74 ఇల్లు మాత్రమే ఈ సంవత్సరం చివరికి పూర్తి చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్న గొప్ప ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు మార్కులు సున్నా అనడంలో సందేహం ఏమన్నా ఉందా?అని దండుకోవడం దాచుకోవడం అవినీతి మీద ఉన్న శ్రద్ధ పేద ప్రజలకు కేటాయించిన టిడ్కో ఇళ్లను అందజేయడం మీద సెంటు భూమి పథకం కింద ప్లాట్లు చూపించడం పై ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు. ఇటువంటి పనికిమాలిన ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గానికి అవసరం లేదన్నారు. టిడ్కో ఇళ్ళు ఎప్పటికీ పూర్తి చేస్తామో స్పష్టంగా తెలియజేయలేమని చెబుతున్నారని, ఇళ్ల నిర్మాణ పథకం వైసిపి రాష్ట్ర ప్రభుత్వ పథకం కాదని, ఇది పి.ఎం.ఏ.వై కేంద్ర ప్రభుత్వ పథకమేనని, లబ్దిదారునికి 180000 రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని, 35000 డ్వాక్రా రుణం ద్వారా లబ్ధిదారునికి ఇప్పించి అక్కడినుంచి కాంట్రాక్టర్ కి మల్లిస్తారని, 215000 కాంట్రాక్టర్ కి చెల్లిస్తే 4 పిల్లర్స్ తో ప్లాస్టింగ్ లేని గోడలతో స్లాబ్ వేసి అందజేస్తారని, ఇదంతా పేద ప్రజల రక్తాన్ని జలగన్న పీల్చే పధకం అని ఇది కేవలం కాంట్రాక్టర్ల కోసం వైఎస్సార్సీపీ ఎంపీ ఎమ్మెల్యే మంత్రులకు వేలకోట్లు దోచి పెట్టేందుకేనని ఈ పథకమని, పేదలందరికీ ఇళ్లు స్కీము పెద్ద స్కామని, భూములు కొనుగోలు చదును మార్కింగ్ మెటీరియల్ అమ్మకాలు అన్ని సిఎం జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చేవని, ఈ పథకం కింద ఇప్పటికే 15 వేల కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారన్నారని, 7 లక్షల రూపాయల పైచిలుకు నిర్మాణవేయమయ్యే సెంటు భూమిలో 1,80,000 తో నిర్మాణం ఏ విధంగా చేస్తారని, అప్పులు తీర్చలేక రాబోయే 20 సంవత్సరాలు వరకు పేద సామాన్యుల ఈ సెంటు భూమి పథకంలో కూరుకుపోయి జీవితాలు వ్యర్థం చేసుకుంటారని, నిర్మాణానికి అదనంగా జగన్ ప్రభుత్వం సామాన్యుల వద్ద నుంచి విద్యుత్ వాటర్ కనెక్షన్లు కావాలంటే లబ్ధిదారు డబ్బులు అదనంగా చెల్లించాల్సిందేనని, ఇంటి నిర్మాణంతో వాటికి సంబంధం లేదని, ఇదంతా పచ్చి మోసం అన్నారు. గత రెండు రోజుల నుంచి విజయవాడ నగరానికి సంబంధించి టిడ్కో ఇల్లు జగనన్న కాలనీలను సందర్శించామని ఇందులో ఎన్నో అవినీతి వాస్తవాలు అధికార పార్టీ గురించి బహిర్గతం అయ్యాయని గత ప్రభుత్వ హయాంలో 70 నుంచి 90 శాతం పూర్తయిన జక్కంపూడిలోని టిడ్కో గృహ సముదాయం నేటికీ అందజేయలేదని లబ్ధిదారులందరినీ సెంటు భూమి పథకానికి మళ్ళించి టిడ్కో గృహాలను అమ్ముకొని వేల కోట్ల రూపాయల సంపాదించుకునే కుట్టని ఇందులో దాగుందని అదేవిధంగా వెలగలేరు లో ఇచ్చిన లేఅవుట్ ఒక పక్కన బుడమేరు మరొక పక్కన పోలవరం కాలవల మధ్య ఉందని ఇది ఎప్పుడైనా ముంపుకి గురయ్యే ప్రాంతమని ఇక్కడ మౌలిక వసతులు ఏ మాత్రం లేవని, ఈల్లప్రోలు ,వెదురు పావులూరు జగనన్న లేఔట్ లో ఇంతవరకు ప్రారంభం కాలేదని స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్, పొట్నూరి శ్రీనివాసరావు, కొరగంజి రమణ, షేక్ అమీర్ భాష లతోపాటు నాయుకులు స్టాలిన్ శంకర్, వెన్నా శివ శంకర్, శ్రీదేవి, జగదీష్, పవన్ కళ్యాణ్, అధి, రాళ్లపూడి గోవింద్, చెవుల శ్రీనివాస్, పోతిన యుగంధర్, రేఖపల్లి శ్రీను, పుల్లారావు, పిళ్ళా శ్రీకాంత్ సాయి, నాగూర్ తదితరులు పాల్గొన్నారు.