వంపురు గంగులయ్య సమక్షంలో జనసేనలో చేరికలు

అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరు లో శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో పాడేరు అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా ..వంపురు గంగులయ్య అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలి మురళి కృష్ణ ద్వార శతక సత్యనారాయణ ఆధ్వర్యంలో సూకురు పుట్టు, దొడ్డిపల్లి, బొడ్డు మామిడి, డిప్పల గొంది, సంపలు గ్రామాల నుంచి పెద్దఎత్తున యువత జనసేన పార్టీ ఆశయాలు, లక్ష్యాలు, సిద్ధాంతాలు నచ్చి స్వచ్ఛందంగా వైసీపీ పార్టీని వీడి పాడేరు అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ చేతుల మీదుగా జనసేన పార్టీ కండువ కప్పుకుని జనసేన పార్టీ లోకి చేరారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా పాలన, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్కరినీ అడిగిన సంతృప్తికరమైన సమాధానం వినలేము పంచాయితీ నిధులు, కార్పొరేషన్ నిధులు ఇలా దోచుకోవడానికి కాదేదీ అనర్హం అనేవిదంగా ఉందని.. ఇది దోపిడీ పాలన అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముందని శతక సత్యనారాయణ తెలిపారు. ఇరడపల్లి పంచాయితీ సంపలు గ్రామ నాయకుడు కిల్లో చిన్నారావ్ మాట్లాడుతూ.. జనసేన సిద్ధాంతాలు, ఆశయాలు అధివాసులకు మంచి చేసే విదంగా ఉందని, అందుకే జనసేన పార్టీ లోకి చేరమని చెప్పారు. ఈ చేరికతో పార్టీలోకి నూతన ఉత్తేజం వచ్చిందని అందరం కలిసి కట్టుగా ప్రజల్లోకి వెళ్లి మన ఆశయ సాధన కు కృషి చేద్దామని భవిష్యత్ అంతా జనసేనదేనని.. వైసీపీ పార్టీ కార్యకర్తగా క్షేత్ర స్థాయి నుంచి పనిచేశానని ఏనాడు గుర్తింపు కోసం ఆరాటపడలేదని పదవులు ఆశించకుండా పని చేశానని కానీ ఇవ్వాళ ప్రభుత్వ తీరుతెన్నులు పాలన విధానం నచ్చలేనందుకే వైసీపీ వీడుతున్నామని జనసేన పార్టీ లో స్వచ్ఛందంగా చేరమని ఇకనైనా అంతిమంగా ఈ గిరిజన ప్రజా సంక్షేమమే పాలనకు కొమ్ము కాసే పార్టీ కేవలం జనసేన పార్టీ అందుకే చేరమని తెలిపారు.