తిరుపతి జనసేన ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జనసేన

తిరుపతి, 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జనసేన పీఏసీ ఆఫీస్ వద్ద జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి మరియు రాష్ట్ర, పట్టణ కమిటీ సభ్యులు, పెద్దలు, జనసైనికులతో కలిసి వారు జండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు దేశం కోసం ప్రాణాలు విడిచిన మహనీయులను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరు దేశం పట్ల, మహనీయుల పట్ల ఎంతో కృతజ్ఞతలతో ఉండాలని, కొత్త తరాల వారికి వారి గురించి వివరించాలని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పదేపదే ఆ మహనీయులను గుర్తు చేస్తూ ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సుభాషిణి, బాబ్జి, కృష్ణయ్య, సుమన్ బాబు, కీర్తన, మునస్వామి, ఆనంద్, చరణ్, బాటసారి, హిమవంత్, కర్ణం లక్ష్మి, విజయ రెడ్డి నవ్య రెడ్డి, హేమంత్, ఆదికేశవులు, సాయికుమార్, పురుషోత్తం, రాంబాబు, వెంకటేష్, పురుషోత్తం, కౌషిక్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.