శ్రీమతి లోకం మాధవి సమక్షంలో జనసేనలో చేరికలు

నెల్లిమర్ల మండలం, మోయిదా పంచాయతీ నుండి మీసాల గౌరీ నాయుడు తన అనుచర వర్గంతో జనసేన పార్టీ ముంజేరు కార్యాలయంలో నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకోవడం జరిగింది. గత నాలుగేళ్లుగా వైకాపా ప్రభుత్వ ఆధిపత్య ధోరణి, ప్రాంతంలో లేని అభివృద్ధి, స్థానిక వైకాపా నేతల తీరుపై విసుగు చెంది జనసేన పార్టీ కండువా కప్పుకున్నామని తెలియజేశారు. అలాగే శ్రీమతి లోకం మాధవి ఆలోచనా విధానం, ఈ ప్రాంతం పైన తమకి ఉండే మక్కువ, అలానే ప్రజలలో మాధవి గారికి ఉండే ఆదరణ చూసి శ్రీమతి లోకం మాధవితో పని చేయాలనే ఆలోచన జనసేన పార్టీలో చేరేదుకు ఒక కారణమని వెల్లడించారు. లోకం మాధవి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసే ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని, బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అంటే అందరూ ఒక తాటిపైకి వచ్చి ఈ జగనాసురుడుని కలసికట్టుగా ఎదుర్కోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.