శ్రీమతి లోకం మాధవి సమక్షంలో జనసేనలో చేరికలు

నెల్లిమర్ల మండలంలోని మిమ్స్ హాస్పిటల్ కి చెందిన ఉద్యోగి అయిన అట్టాడ మహేష్ వారి అనుచరగణం (కొండవెలగాడ పంచాయతీ) జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు, లోకం మాధవి సేవా గుణం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన, యువతకి బంగారు భవిష్యత్తు తేవాలనే తపన చూసి నేడు శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో ముంజేరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అట్టాడ మహేష్ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి చెందాలంటే శ్రీమతి లోకం మాధవికి ఓటు వేసి గెలిపించాలని, నిస్వార్థ రాజకీయాలు శ్రీమతి లోకం మాధవితోనే సాధ్యమని తెలియజేశారు. అలాగే డెంకాడ మండలం జొన్నాడ పంచాయతీకి చెందిన సుమారు 25 కుటుంబాలు శ్రీమతి లోకం మాధవి నాయకత్వంపై నమ్మకం ఉంచి ఈరోజు ముంజేరు జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి కండువాలు కప్పి మాధవి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.