అంగన్వాడీల దీక్షకు మద్దతు తెలిపిన తలాటం సత్య

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటిలో పి.ఏ.సి సభ్యులు & కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ధర్నా శిబిరాన్ని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య సందర్శించారు. ఈ సందర్భంగా తలాటం మాట్లాడుతూ అంగన్వాడీలకు మద్దతుగా తమ నాయకుడు శ్రీ.పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని వారికి అందచేసి తమ మద్దతుని ప్రకటించారు. ఓట్లు అడుక్కొంటున్న వేళ హామీల మీద హామీలు ఇచ్చి తీరా వారి అవసరం తీరిపొయాకా పూచికపుల్లలా తీసెయ్యడం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైజం అని ప్రజలకు తేటతెల్లం అయ్యిందన్నారు. అంగన్వాడీలను భయబ్రాంతులకు గురిచేస్తూ వారి కార్యాలయల తాళాలను బద్దలు కొట్టి జులూం ప్రదర్శించడం వారి అదుపులోకి తీసుకోవడం చాలా దారుణమనీ దీనికి ఫలితం తప్పకుండా ఈ జగన్మోహన్ రెడ్డి అనుభవిచాలన్నారు. అంగన్వాడీలకు తమ మద్దతుని పార్టీ పి.ఏ.సి సభ్యులు & కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ అందచేస్తారనీ, వెనకడుగు వేసే ప్రసక్తేలేదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, మండపాక దుర్గాప్రసాద్, దారపు సతీష్, దుర్గా శివకుమార్, చీకట్ల వాసు, బట్టు లీల, మిరియాల హైమావతి, బండి సుజాత, దీప్తి తదితరులు పాల్గొన్నారు.