అనంతపురం జనసేనలో చేరికలు

నగరంలోని పలు డివిజన్ల నుంచి యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది – నగర అధ్యక్షులు పొదిలి బాబురావు

అనంతపురం నగరం నందు జనసేన పార్టీలోకి వివిధ వర్గాల ప్రజల నుండి యువత మంచి ఆదరణ పెరుగుతోంది అనడానికి జనసేన పార్టీలోకి చేరికలు నిదర్శనం. నగరం నుంచి వివిధ డివిజన్ల నుండి యువత పార్టీలోకి చేరుతూ గతంలో టిడిపి మరియు ప్రస్తుత వైఎస్సార్ ప్రభుత్వాలు యువత భవిష్యత్తుతో ఆడుకుంటుంది. ప్రస్తుతం బడుగు బలహీన వర్గాలకు, యువతకు సరైన న్యాయం జరగాలంటే అదే ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం అవుతుంది. కనుక మేము సైతం పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనే మా అడుగు ఉంటుందంటూ యువత నేడు జనసేన పార్టీలోకి గిరిబాబు, ప్రశాంత్, బాబు, అర్జున్, రాజు, నారాయణస్వామి, కృష్ణ మరియు తదితరులు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శ నాగేంద్ర, సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్ మరియు అర్బన్ నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.