కమ్మసిగడాం ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటి

*పవనన్న ప్రజాబాట 64వరోజు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు సోమవారం జనసేన పార్టీ నాయకులు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు, జనసేన పార్టీ యంపీటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు సోమవారం ఉదయం కమ్మసిగడాం చెరువులో పర్యటించి.. చెరువులో ఉన్న ఉపాధి కూలీలను ప్రతి ఒక్కరినీ కలవడం జరిగింది.

జనసేన పార్టీ మేనిఫెస్టో గురించి ప్రతి మహిళకు, యువతకు,పెద్దలకు, తెలియజేస్తూ.. పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి 62 రోజులు పూర్తిచేసుకుని.. సుదీర్ఘంగా ప్రజలు దగ్గరకు వెళ్ళి పలు కుటుంబాలను పలకరిస్తూ.. ముందుకు సాగడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో బాగంగా 3000 మంది చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను నేరుగా పరామర్శించి.. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం అందిస్తున్న.. గొప్ప మనసున్న నాయకుడని.. అలాంటి నాయకుడిని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. అలాగే వివిధ విషయాలు గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే.. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగేరాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తుందో వివరించడం జరిగింది.

1. ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ విధానం రద్దు, 2.గృహిణులకు వంటగ్యాస్ ఫ్రీ, 3.తినడానికి పనికి రాని రేషన్ బియ్యం బదులుగా 2500-3500 ఆకౌంట్ లో డబ్బులు జమ, 4.రైతులకు ఫించన్లు వారికి లాభసాటి వ్యవసాయం కోసం అన్ని విధాల సహాయం, 5.తెల్ల రేషన్ కార్డు వాల్లకి ఇసుక ఫ్రీ, 6. నిరుద్యోగులకు సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ప్రవేటు రంగంలో మరియు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాడానికి ఆర్థిక సాయం, 7. ఎల్ కె జి నుండి పీజీ వరకు ఉచితంగా విద్య, 11 స్టాండర్డ్ నుంచి ఉచ్చితంగా ల్యాప్ ట్యాప్ లు, 8. ప్రతి కుటుంబానికి పదిలక్షల ఆరోగ్య భీమా, మండాలానికో 30పడకల ఆసుపత్రి, 5గ్రామాలకి ఒక అంబులెన్స్ సదుపాయం, 9.వెనుకబడిన కూలాల వారికి కార్పోరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పాటు,10.కాపులకి రిజర్వేషన్లు, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ గా మార్చడం ప్రజలు ఆలోచిస్తే ఈ హామిలు చాలు అప్పులు లేకపోతే రాష్ట్రానికి ప్రజల దగ్గర నుండి ఇప్పటి లా అధిక పన్నులు వసూలు చెయ్యవలసిన పని ఉండదు.. ఆలోచించండి ఇంత కంటే ప్రజలకోసం గొప్పగా ఎవరు ఆలోచిస్తారు. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇద్దాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసిపికి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గెలిపించికోవాలని ఈ సందర్భంగా ప్రజలు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమ్మసిగడాం గ్రామ, ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.