నందిగామలో జనసేనలో చేరికలు

కృష్ణాజిల్లా, నందిగామ నియోజకవర్గంలో కృష్ణాజిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్, నందిగామ నియోజకవర్గ నాయకులు రాజేష్, నందిగామ మండల అధ్యక్షులు రామారావు సమక్షంలో నందిగామ మండలం అడవి రావులపాడు గ్రామము నుండి వైసీపీ, టీడీపీ నుండి 120 కుటుంబాలు జనసేనపార్టీలో చేరడం జరిగింది. కృష్ణాజిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ అడవి రావులపాడు నుండి ఎస్సి, బీసీ, మైనారిటీలు, కాపు సామాజిక వర్గం నుండి 120 కుటుంబాలు జనసేనపార్టీలో చేరడం చాలా అందంగా ఉంది. జనసేనపార్టీ జిల్లా కమిటీ నియోజకవర్గ మండల కమిటీ అందరూ కలిసి ఈ కార్యక్రమాము విజయవంతం చేయడం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ మాట్లాడుతూ ఈరోజు అడవి రావులపాడు నుండి ఇంతమంది జనసేనపార్టీలో చేరడం అంటే మాములు విషయం కాదు ఈ కార్యక్రమము బాధ్యతలు తీసుకున్న నియోజకవర్గ నాయకులు రాజేష్ , మండల నాయకులు రామారావు లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపుకుంటున్నానని అన్నారు. జిల్లా అధ్యక్షులు వారు నాలుగు నియోజకవర్గలు మండల కమిటీ బాధ్యతలు అప్పీజెప్పటనుండి ఆయా ఆయా జిల్లా కమిటీ సభ్యులు మరియు మండల కమిటీ సభ్యలు జనసేనపార్టీ కార్యకర్తల్ని సంప్రదించి పార్టీని ఏ రకంగా ముందుకు జనసేనపార్టీని తీసుకొని వెళ్తే ప్రణాళికలు సిద్ధం చేసి ప్రజల్లోకి వెళ్లడం జరిగింది ఇది మా జనసైనిలు మొదటి విజయం ఇలాంటి విజయాలు మరిన్ని చేయాలని నియోజకవర్గ నాయకులు రాజేష్, రామారావు లకి చెప్పడం జరిగింది. నియోజకవర్గ నాయకులు రాజేష్, మండల నాయకులు రామారావు మాట్లాడుతూ అడవి రావులపాడు గ్రామములో జనసేనపార్టీ క్రియాశిలా సభ్యత్వం కోసం వెళ్తే నేను చేస్తాను నేను పార్టీ లోకి వస్తాం అని గ్రామప్రజాలు అండతో 155 జనసేనపార్టీ సభ్యత్వాలు చేసారు క్రియాశీలక సభ్యత్వం సమయం ఇంకా కావాలి మాకు దగ్గర దగ్గర 500 నుండి 600 సభ్యత్వాలు చేస్తాం అని మాట్లాడడం జరిగింది. దీనిని బట్టి జనసేనపార్టీలో ఎంత బలంగా పుంజుకుంటుందో అర్థం అవుతుంది. ఈ కార్యక్రమంలో పొలిశెట్టి తేజ, మండల అధ్యక్షులు సుధాకర్, సతీష్, జయరాజ్, టౌన్ అధ్యక్షులు తాటి శివ, 20 వార్డు కౌన్స్లర్ వెంకట కృష్ణ భారీ ఎత్తిన జనసేనపార్టీ నాయకులు కార్యకర్తలు అడవి రావులపాడు గ్రామప్రజలు పాల్గొన్నారు.