లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విడివాడకు సన్మానం

తణుకు నియోజకవర్గం, అత్తిలి మండలం, అత్తిలి గ్రామంలో లయన్స్ క్లబ్ వారిచే నిర్వహించబడిన చాటర్నైట్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు మరియు అత్తిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్ పాల్గొనడం జరిగింది. అత్తిలి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో విడివాడ రామచంద్రరావు ఆర్థిక సహాయంతో అనేక ఐ క్యాంపులు మరియు డెంటల్ క్యాంప్ నిర్వహించారు. మరియు సుమారుగా 2000 మందికి రామచంద్రరావు ఆర్థిక సాయంతో ఉచితముగా కళ్ళజోళ్ళు అందజేశారు. లయన్స్ క్లబ్ వారు విడివాడ రామచంద్రరావు సేవా కార్యక్రమాలు గుర్తించి ఘనంగా సన్మానించారు మరియు అత్తిలి మండలం అధ్యక్షులు దాసం ప్రసాద్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో దాసం ప్రసాద్ ఆర్థిక సహాయంతో అనేక క్యాంపులు నిర్వహించడం జరిగింది. మరియు దాసం ప్రసాద్ ఆర్థిక సహాయంతో సుమారుగా 1500 మందికి ఉచితముగా కళ్ళజోళ్ళు అందజేశారు ప్రసాద్ సేవా స్ఫూర్తిని గుర్తించి లయన్స్ క్లబ్ వారు ఘనంగా సన్మానించడమే కాక లయన్స్ క్లబ్ లో మెంబర్ గా జాయిన్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, తణుకు పట్టణ జనసేన అధికార ప్రతినిధి పంతం నానాజీ, అత్తిలి గ్రామం జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.