అనంతలో జనసేనలో చేరికలు

అనంతపురం జిల్లా జనసేన పార్టీ మహిళా కార్యాలయంలో జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాళ్లు పసుపులేటి పద్మావతి ఆధ్వర్యంలో మరియు పెండ్యాల శ్రీలత అధ్యక్షతన ఇతర పార్టీల నుంచి శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలంలోని రామిరెడ్డి కాలనీకి చెందిన పలువురు ముస్లిం మైనారిటీలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వలన ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం జరిగిందని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దుల్హన్ పథకం, విదేశీ విద్యకు ఆర్థిక సహాయం, ఇస్లామిక్ బ్యాంకులు, ఇమామ్ లకు మౌజాలకు ప్రత్యేక గృహాల ఏర్పాటు వంటి అనేక హామీలకు తూట్లు పొడిచి మమ్మల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని అందువల్ల మాకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తోను జనసేన పార్టీతోనే మాకు సచార్ కమిటీల ద్వారా సమగ్రమైన అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రహించి ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగిందని రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ ప్రభుత్వ స్థాపనకు, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళి, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, సభాధ్యక్షురాలు కాశెట్టి సావిత్రి, కార్యదర్శి పద్మావతి, వీర మహిళలు శిల్పా, రూపా, కుళ్ళాయమ్మ , నాయకులు తోట ప్రకాష్, కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, సోము, సాయి కుమార్, చంద్ర, కిరణ్ జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.