బొలిశెట్టి సమక్షంలో జనసేనలో చేరికలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రత్తిపాడు బి.ఆర్.కాలనీ యూత్ అత్తిలి బాబి ఆద్వర్యంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అధ్యక్షతన బి.సి సామాజిక వర్గం, దళితులు నుండి సుమారు 300 మంది మహిళలు, పురుషులు, యువకులు బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, సంయుక్త కార్యదర్శి, కె హరినాధ్, కె విజయ్, మండల అధ్యక్షులు పుల్లా బాబీ, అడపా ప్రసాద్, వీరమహిళా విభాగ చైర్మన్ కాసిరెడ్డి మధులత, కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉప అధ్యక్షులు, గట్టు గోపికృష్ణ, వీరమహిళలు పాల్గొన్నారు.