వారోత్సవాలలో భాగంగా సర్వమత ప్రార్ధనలు

గజపతినగరం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గజపతినగరం జనసేన ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో భాగంగా గోత్రనామాలతో పూజా కార్యక్రమాలను వినాయకుని గుడిలో జరిపించడం జరిగింది. చర్చిలో పాస్టర్ తో ప్రార్థన చేయించడం జరిగింది, అలాగే మసీదులో మసీదు పెద్దలతో ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజపతి నగరం జనసేన నాయకు మర్రాపు సురేష్, జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు రవికుమార్ మిడతన, గజపతినగరం నాయకులు పండు మహేష్ శ్రీను హరీష్ సురేష్ రెడ్డి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.