నెల్లూరు రూరల్ నుండి జనసేన పార్టీలోకి చేరికలు

నెల్లూరు: 25వ డివిజన్ జనసేన నాయకులు కుడుముల సురేష్ ఆధ్వర్యంలో బుధవారం దాదాపుగా యువత జనసేన పార్టీలో చేరారు. వారిని జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారి కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అత్యున్నత విలువలు గల రాజకీయ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని తెలిపేందుకు ఐక్యరాజ్యసమితి ఆహ్వానం నిదర్శనం. ప్రజల సమస్యల గురించి సమగ్ర అవగాహన కలిగిన వారు. రాష్ట్ర అభివృద్ధి గురించి దేశ ప్రగతి గురించి ఆలోచించగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఫలానా అగ్ర కులానికి బానిసత్వం చేస్తూ ఫలానాకులం లో చేరాలనుకునే స్వార్థపరులు ఒకవైపు అయితే.. ఫలానా వెనకబడిన తరగతుల కులాన్ని స్వీకరించి వారి అభివృద్ధికి తోడ్పడుతానని పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు. ఐదు సంవత్సరాల కాలంలో ఓడిపోయిన 50 కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమం కోసం పంచిన పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి. నైపుణ్యం ఘనన చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలుగా అభివృద్ధి పరిచేందుకు ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. వ్యతిరేక ఓట్లు చీల నివ్వను అన్న నిర్ణయానికి కట్టుబడి దాన్ని విజయవంతం సాధించబోతున్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలన ఎదురించాలని ఒక క్లిష్టమైన పొత్తుకు స్వీకారం చుట్టి భారీ మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకోబోతున్నాం. చాలా రోజుల నుంచి జనసేన పార్టీకి మద్దతుగా ఉన్న వీరు ఈ రోజు డివిజన్ స్థాయి నాయకుడిగా వ్యవహరిస్తున్న ఒకరిద్దరు పార్టీ మారడం వల్ల జనసేన కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పంచుకుంటామని ముందుకు రావడం అభినందనీయం. పొత్తుకు ప్రజలు మద్దతు ఉంది. ఈ రోజున ఉమ్మడి అభ్యర్థులు గెలుపుకై మేమంతా కలిసి పని చేస్తాం. వైయస్సార్సీపి వ్యతిరేక ఓట్లను ఏవి కూడా చీలవ్వకుండా భారీ మెజారిటీతో అభ్యర్థులను గెలిపించుకుంటాం. మంచి ప్రజాదరణ కలిగిన నాయకులను ఉమ్మడి అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. నెల్లూరు రూరల్ పోటీ చేస్తున్న నెల్లూరు శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు సిటీ నుంచి పొంగూరు నారాయణ గారు, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ కూడా అవినీతి లేని నాయకులను గెలిపించాలి. ప్రజలందరూ కూడా ఓటు హక్కుగా మాత్రమే కాకుండా బాధ్యతగా కూడా వ్యవహరించి జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించి ప్రజా ప్రభుత్వం ఏర్పరచాల్సిందిగా కోరుకుంటున్నాను.