పవన్ కళ్యాణ్ గెలుపు చారిత్రక అవసరం: జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం, జనసేనపార్టీ 11వ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో గల జనసేనపార్టీ కేంద్రకార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పిఠాపురం నియోజవర్గం నుండి శాసనసభ్యునిగా జనసేన-టిడిపి-బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజవర్గం నుంచి పోటీ చేయటం ఎంతో ఆనందదాయకమని స్వాగతించదగ్గ విషయమని జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం రూరల్ మండలం, గొల్లప్రోలు మండలం,ఉప్పాడ కొత్తపల్లి మండలం, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికి 20 వేల కరపత్రాలను పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభ్యునిగా పవన్ కళ్యాణ్ గెలుపు చారిత్రక అవసరం అనే హెడ్డింగ్ తో ప్రింట్ చేయించి గ్రామ, గ్రామాన పిఠాపురం నియోజకవర్గం నందు పంచిపెట్టాలని ఉద్దేశంతో శనివారం రైతులకు సంబంధించిన పిఠాపురం పశువుల సంత నందు పవన్ కళ్యాణ్ ఆదర్శ భావాలతో ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా జనసేనపార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు గత 86 వారాల నుండి ఉచితంగా ప్రతి శనివారం నాడు పశువుల సంత రోజున రైతులకు ఉచితంగా మద్యహ్నం నీరు, భోజన సదుపాయం కల్పించే చోటు, కలియుగ అన్నపూర్ణ మాత శ్రీమతి డొక్కాసీతమ్మ అన్న సదుపాయ కేంద్రం వద్ద రైతులచే పాంప్లెట్లను పంపీణీ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ గౌరవనీయులైన పిఠాపురం నియోజకవర్గం ఓటరు మహాశయులంతా కూడా ఆలోచించి ఆదర్శభావాల ఉన్నా పవన్ కళ్యాణ్ ని శాసనసభ్యునిగా గెలిపించుకొనుటకు ప్రతి ఒక్క ఓటరు కూడా గ్లాసు గుర్తుకు ఓటేయాలని ఆయన ఓటరు మహాశయులను కోరిప్రార్థించారు. అదేవిధంగా జనసైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు కూడా పిఠాపురం నియోజకవర్గం నందు గల ప్రతి ఓటర్ని కలిసి పవన్ కళ్యాణ్ కి గ్లాసు గుర్తుపై ఓటు వేయమని అభ్యరించి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన రైతులకు, జనసైనికులకు, జనసేన కార్యకర్తలకు,నాయకులకు,వీర మహిళలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన నాయకులు అల్లం కిషోర్, అమజాల సుబ్బారావు, అల్లాడ కన్నారావు, వీరమహిళలు బంగారు లక్ష్మి, ముత్యాల భువనేశ్వరి, అల్లం రాజేశ్వరి, ముత్యాల అను, రాయవరపు శారదా, అల్లం సామాలమ్మ, జనసైనికులు గుళ్ళ తేజ, నక్కా మణికంఠ, బోడపాటి కనకరాజు, అల్లం శ్రీనువాసు, బండి శివ, జ్యోతుల నానాజీ, సఖినాల లచ్చబాబు, విప్పర్తి శ్రీను, విప్పర్తి కృపాకర్, జ్యోతుల నాని తదితరులు పాల్గొన్నారు.