దసరా పండగ అనంతరం జనసేన-టీడీపీ సంయుక్త కార్యచరణ

మదనపల్లె, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ దుష్ట పాలన, ప్రజా సమస్యలు, చంద్రబాబు అరెస్టు, జనసేన, టిడిపి పొత్తులపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి చర్చించారు. శుక్రవారం రాత్రి అంగళ్లు సమీపంలో జరిగిన ఓ వివాహ వేడుకలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్, టిడిపి రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు, టిడిపి ముస్లిం మైనారిటీ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్ టిడిపి నాయకులు, జనసేన పార్టీ నాయకులు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, గంగారపు రామదాస్ చౌదరి పలు విషయాలపై చర్చించారు. ‌ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్లో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాలలో జనసేన – టీడీపీ పార్టీల భవిష్యత్తు గురించి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ దుష్ట పాలన, ప్రజా సమస్యలు, చంద్రబాబు అరెస్టు గురించి చర్చించడం జరిగింది. దసరా పండగ అనంతరం సంయుక్త కార్యచరణతో ప్రజలలోకి వెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేయడానికి కావలసిన పరిస్థితులపై చర్చించారు. ‌