ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు కందుల దుర్గేష్ తో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ జూమ్ సమావేశం

జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో సురేష్ వరికూటి అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు కందుల దుర్గేష్ తో శనివారం జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. తమ తమ దేశాల నుండి ఒక్కొక్కరిగా సేవలు అందించడం కంటే అందరూ సంఘటితమై ప్రపంచ వ్యాప్తంగా అన్ని టీంలు కలిసి ఒక్క టీంగా వెళ్ళాలి అనే ముఖ్య లక్ష్యంతో ఏర్పడినటువంటి “జె.ఎస్.పి గ్లోబల్ టీం” నుండి వివిధ దేశాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు కందుల దుర్గేష్ తో వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు తమ తమ నియోజకవర్గాలలోని సమస్యలపై చర్చించడం జరిగింది. అనేక దేశాల నుంచి ఎన్నారైలు సుమారు 21 దేశాల వారు ఒక మీటింగ్ కి వచ్చి ఇలాగా జనసేన ఇన్చార్జిలతో జూమ్ కాల్ ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం అంటూ ఇటువంటి బాధ్యతలు తీసుకున్న వరికూటి సురేష్ కి అభినందనలు తెలియజేశారు. * ఈ సందర్భంగా కందుల దుర్గేష్ ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూ కచ్చితంగా ఎలక్షన్లు ఈసారి ముందస్తుగానే వస్తాయి అంటూ వచ్చే జనవరికి మన జనసేన పార్టీకి పొత్తు ఉంటుందా లేదా అనే దానిమీద మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇస్తూ పూర్తిస్థాయిలో ఇన్చార్జిల ప్రకటన జరుగుతుందని తెలియజేయడం జరిగింది.

  • ఇప్పటివరకు ఇన్చార్జిలను ప్రకటించ పోవడానికి గల ప్రధాన కారణం జనసేన పార్టీలో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుపుతూ, ఈసారి పూర్తిస్థాయిలో గెలిచే అభ్యర్థులని పోటీలకు దించడానికి జనసేనాని సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు.
  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి జనవాణి కార్యక్రమం అయితేనేమి, కౌఉ రైతు భరోసా యాత్ర అయితేనేమి ప్రజలలో చాలా మార్పును తీసుకొచ్చాయని తెలియజేశారు. * మన స్వరాన్ని మన గళాన్ని వినిపించడానికి తెలియజేయడానికి మనకి పెద్ద పెద్ద టీవీ ఛానల్ లో సపోర్టు ఉండే పరిస్థితి ప్రస్తుతం లేదని సోషల్ మీడియాని మనం బలంగా వాడుకోవాలని ఇప్పటివరకు సోషల్ మీడియాలో స్పందిస్తున్న వారి తీరు చాలా అద్భుతంగా ఉంది అని తెలియజేశారు.
  • ఈరోజు అమరావతిని మనం రాజధానిగా సాధించుకున్నాము అంటే ఒకే ఒక కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎంతోమంది రైతుల అమరావతి రైతుల కన్నీటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బలంగా అమరావతి కోసం పోరాడారు ఈరోజు మన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా తీసుకురావడంలో మనం విజయం సాధించాము అంటే ఒకే ఒక్క కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయం ఒకటే ఆయన చెప్తుంది ఒకటే రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం నేను జనసేన పార్టీని స్థాపించాను అని అదే ప్రక్రియలో జనసేనని ముందుకు నడిపిస్తాను అని తెలియజేయడం జరిగింది.
  • జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి జనవాణి కార్యక్రమాలలో ఇన్చార్జిలు లేని నియోజకవర్గాల్లో సమస్యలను ఎలా గుర్తించాలి? ఎలా పరిష్కరించాలి అనే అంశాల మీద దుర్గేష్ చక్కటి వివరణ ఇస్తూ ఇన్చార్జిలు లేని నియోజకవర్గాల్లో ఇప్పటికే దర్యాప్తు చేపట్టామని ప్రజలకు కచ్చితంగా పరిష్కారం పవన్ కళ్యాణ్ దగ్గరుండి అందిస్తారని ఈ సమావేశంలో తెలియజేశారు.
  • ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఈసారి బడాబడా వైయస్సార్ నాయకులే ఓడిపోయే దిశగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున స్ట్రేటజీని సిద్ధం చేస్తున్నారని ఈ సమావేశంలో తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ జె.ఎస్.పి గ్లోబల్ వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు కూడా ఇలాగే అందరూ ఇన్చార్జిలతో మమేకమై మీ ఆలోచన విధాలను తెలియజేయాలని మీ గ్రూప్ ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తున్నానని దుర్గేష్ తెలియజేయడం జరిగింది.