భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ సంయుక్త నిరసన

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ నిధుల దారి మళ్లింపు, సర్పంచ్ యొక్క హక్కులను హరిస్తున్న వైసిపి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా, పంచాయతీ వ్యవస్థను కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎనిమిది వేల కోట్ల రూపాయలను సర్పంచ్ ఖాతాల్లో నుండి ప్రభుత్వం పక్కదారి మళ్ళించారని, వాలంటరీ వ్యవస్థ ద్వారా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, ప్రభుత్వం చేసే ప్రతి పని ఓటు బ్యాంకు రాజకీయంగా మారిందని, ప్రజలు ఇకనైనా మేల్కొని పంచాయతీ వ్యవస్థను కాపాడుకొని, కుల మత వర్గ భేదాలు లేకుండా గ్రామ అభివృద్ధికి సహకరించే ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఎన్నుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు, సర్పంచ్ సంఘం అధ్యక్షులు, సర్పంచులతో కలిసి జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పొన్న యుఘందర్, స్థానిక నాయకులు దయారం, జిల్లా కార్యదర్శులు పగడాల రమణ, పసుపులేటి దిలీప్, యశ్వంత్, స్వామినాథన్, మండల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, వీర మహిళలలు పాల్గొన్నారు.