నేతన్నల సమస్యల పరిష్కార దిశగా ఉమ్మడి కర్నూల్ లో జనసేన పర్యటన

జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు.. చేనేత కళాకారుల సమస్యలు పరిష్కారం దిశగా రాజకీయ చైతన్యం కొరకు మరియు చేనేత వర్గాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకువెళ్లడానికి బుధవారం ఉమ్మడి కర్నూల్ జిల్లాలో పర్యటించడం జరిగింది.

ఈ పర్యటనలోభాగంగా కోడుమూరు పట్టణం చేనేత కాలనీలో చేనేతల గృహాలకు స్వయంగా వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు

ఈ సందర్భంగా చేనేతల సమస్యలు వారి మాటల్లో……

మానవాళి మనుగడకు వస్త్రం నేసిచ్చిన నేతన్న నేడు దీనస్థితిలో ఉన్నాడు.
ఒకప్పుడు కుటుంబం మొత్తం నేతనేసే పరిస్థితి ఉంటే నేడు పనికి తగిన ఆదాయం లేకపోవడం వలన బిడ్డలను చేనేత రంగం వైపు నడిపించలేని పరిస్థితి ఏర్పడింది.
కుటుంబంలోని నలుగురు వ్యక్తులు కలిసి ఒక చీరను నేయాలి అంటే 7 రోజుల నుండి 10 రోజులు పడుతున్నప్పటికీ దాని ద్వారా వచ్చే ఆదాయం కేవలం 2000 రూపాయలు నుండి 3000 రూపాయలు మాత్రమే. కుటుంబంలోని నలుగురు వ్యక్తులు నెల మొత్తం కష్టపడి నేత నేస్తి వచ్చే ఆదాయం సరాసరి 5000 నుండి 6000 మాత్రమే.
చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషించలేక బిడ్డలను చదివించలేక వారి చదువులకు మరియు పిల్లలకు వివాహాలకు వడ్డీలకు అప్పులు తెచ్చి ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న నేతన్నలు ఎందరో ఉన్నారు.
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం నిజంగా ప్రభుత్వాల వైఫల్యాలకు నిదర్శనమని తెలియజేశారు.

పెరుగుతున్న నూలు, పట్టు రేట్ల వలన కష్టానికి తగిన కూలీ రావట్లేదని ఆవేదన చెందుతున్నట్లు తెలిపారు.

నేతన్న నేస్తం పథకం కూడా ఒక కుటుంబంలో నలుగురు నేత నేసే వ్యక్తులు ఉంటే కేవలం ఒక్కరికే ఇస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వం సొసైటీల ద్వారా పని కల్పించి గిట్టుబాటు కూలీ ఇస్తే బాగుంటుంది అని కొంతమంది కోరారు.
ప్రభుత్వం అంత్యోదయ కార్డులు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వం చేనేత కళాకారులకు సబ్సిడీతో ముడి సరుకును అందించి అలాగే వారు వేసిన వస్త్రాన్ని వారే మార్కెట్లో అమ్ముకునే సహకారాన్ని అందించగలిగితే కష్టాలు, కన్నీళ్ల నుండి మరియు దళారుల నుండి చేనేత కళాకారులను బ్రతికించి చేనేత కళ్ళను వందేళ్లపాటు సజీవంగా ఉంచగలిగిన వారవుతారు లేకపోతే నేడు నేతన్నల పరిస్థితి ఎలా ఉందంటే “రాత్రి చనిపోతే దీపం లేదు పగలు చనిపోతే కూడు లేదు” అనే పరిస్థితులు నేతన్నలు దయనీయమైన స్థితిలో బతుకుతున్నారు.

ఈ సందర్భంగా చేనేత కళ బ్రతికి చేనేత కళాకారుల జీవన స్థితిగతులు మెరుగుపడాలంటే ప్రతి చేనేత కుటుంబానికి 3 మూడు సెంట్లు స్థలం కేటాయించి మరియు షెడ్డు కట్టుకోవడానికి సహాయం అందించి దానితోపాటు ముడి సరుకు సబ్సిడీ ద్వారా అందించి నేతన్న నేసిన వస్త్రాన్ని వారే మార్కెట్లో తగిన ధరకు అమ్ముకునేలా సహకారం కోరారు.

కోడుమూరు నియోజకవర్గాలలో చేనేత కళాకారులనుండికర్రె సరస్వతి, మధు, భాస్కర్ తదితర కళాకారుల కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. చిల్లపల్లి శ్రీనివాసరావు పార్టీ కండువా గుప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్, పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శులు జంజనం సాంబశివరావు, పార్టీ మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కోఆర్డినేటర్ వెంకటమారుతి రావు, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు షేక్ వజిర్ భాష మరియు పార్టీ నాయకులు మరియు చేనేత కళాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్య నిర్వహణ కమిటీ సభ్యులు యడ్లపల్లి విశ్వ, కర్నూలు జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీనివాసులు గౌడ్, ఎం. షాలు భాష. కోడుమూరు నియోజకవర్గ నాయకులు ఆకెపోగు రాంబాబు, సి.లక్ష్మన్న, కె. కృష్ణ బాబు, ఎల్లప్ప, రాజు, గిరీష్, విజయ్ కుమార్, బాలు, విజయ్, గోపి, మధు, భాస్కర్, మాసుం, నాగరాజు వినయ్, కర్నూలు జిల్లా నాయకులు బి మంజునాథ్, బి సుధాకర్, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.