జూర్రా రిషవర్ధన్ కు అండగా రంపచోడవరం జనసేన

అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజవర్గం, శుక్రవారం రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి కోలుకుంటున్న బాలుడు జూర్రా రిషవర్ధన్ ని రాజవొమ్మంగి మండల జనసేన పార్టీ అధ్యక్షులు బొడిరెడ్డి త్రిమూర్తులు, రంపచోడవరం డివిజన్ నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి పరామర్శించి బాలుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఈ సందర్భంగా రంపచోడవరం నియోజకవర్గ నాయకులు కుర్ల రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ అన్ని విధాలా బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి జనసేన పార్టీ మండలం అధ్యక్షులు బొద్దిరెడ్డి త్రిమూర్తులు రంపచోడవరం డివిజన్ నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, కొంతం శ్రీనివాసు, అడ్డతీగల మండల నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, బాబీ, అప్పాజీ గంగవరవం మండల అధ్యక్షులు కుంజం సిద్దు రాజవొమ్మంగి యువజన అధ్యక్షులు కొచ్చా లోకేష్, మండల నాయకులు పోకల మల్లి మరియు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.