ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం గొలుగువలస గ్రామంలో నాయకులు ఆదినారాయణ, కిరణ్, శంకర్, గ్రామ జనసైనికులు ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు మరడాన రవి అధ్యక్షతన ఆదివారం ఘనంగా జెనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీమతి పడాల అరుణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, సమన్వయకర్త గిరడ అప్పల స్వామి, పలువురు నియోజకవర్గ ఇంచార్జిలు పాల్గొన్నారు, పడాల అరుణమ్మ మాట్లాడుతూ జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకే జెండా ఆవిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు, ప్రజా సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే గ్రామంలో ఉన్న జనసేన నేతలకు తెలియజేసినట్లయితే వాటి పరిష్కారం కోసం పోరాడుతామన్నారు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిందని, ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో జనసేన + టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి గెలిపించాలని పిలుపునిచ్చారు, జనసైనికులు పై ఆక్రమ కేసులు పడితే ఎదురుకునేందుకు పార్టీ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు, రాష్ట్ర కార్యక్రమాల నిర్వహన కార్యదర్శి కార్యదర్శి బాబు పాలూరు మాట్లాడుతూ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆపడానికి ఎన్నో విధాలుగా అడ్డంకులు సృష్టించినా, ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి జనసేనకులకు పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని, రాజకీయ నాయకులకు మీఓట్లు, మీ మీ పిల్లల కావాలి కానీ, మన పిల్లలు మాత్రం రాజకీయ నాయకులుగా ఎదుగుతామంటే ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని మహిళలకు వివరించారు, ఓటు అనేది ప్రజాక్షేత్రం లో ఎంతో విలువైనదని, ఎంతోమంది మేధావులను అధికారం నుంచి ప్రజలు దూరం పెట్టారని, ప్రస్తుత పరిస్థితిలో యువత వోటింగ్ చాలా అవసరమని, వారికి గౌరవం చేసుకోవలిసిన అవసరం రాజకీయ పార్టీలకు ఉందని తెలిపారు, జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో ఏర్పడ్డక గొలుగు వలస గ్రాములో త్రాగు నీటి సమస్యను, పార్టీలకు అతీతంగా అర్హులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందిస్తామని తెలిపారు, గ్రామంలో ప్రజలకు ఉపయోగ కార్యక్రమాలు చేయడానికి యువత ముందుకు వస్తే, ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని, సొంత నిధులతో రచ్చబండ ని ఏర్పాటు చేస్తామని జనసైనికులు ముందువస్తే లేనిపోని అడ్డంకులు పెడుతున్నారని, ఈ విషియాన్ని గ్రామ ప్రజలు ఆలోచన చేయాలనీ, జనసేన పార్టీని ఆదరించాలని కోరారు. గ్రామంలో ఎటువంటి సమస్యలు వున్నా పార్టీ దృష్టికి తీసుకొని వస్తే వాటి పరిస్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు, ఆక్రమ కేసులతో బయపెట్టాలని చుస్తే తాట తీస్తామని హెచ్చరించారు. రాజకీయాలు రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని పిలుపు నిచ్చారు, పవన్ కళ్యాణ్ నిర్ణయం రాష్ట్ర భావిసత్తుకు ఎంతో అవసరమని, జనసైనికులు, తెలుగుదేశం నాయకులు ఆ నిర్ణయాన్ని గౌరవించి కలసి, పొత్తును ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గం కోర్డనేటర్ గిరాడ అప్పలస్వామి, సాలూరు నియోజకవర్గం కో-ఆర్డినేటర్ గేదల ఋషివర్ధన్, గజపతినగరం సమన్వయకర్త మర్రాపు సురేష్, రాజాం నియోజకవర్గం సమన్వయకర్త ఎన్ని రాజు, చీపురుపల్లి సమన్వయకర్త విశనిగిరి శ్రీనివాస్, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, విజయనగరం జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శులు మోతి దాసు, అల్లు రమేష్, మామిడి దుర్గాప్రసాద్, పార్వతీపురం ఐటీ కో-ఆర్డినేటర్ పైల సత్యన్నారాయణ, పోతల శివశంకర్, పళ్లెం రాజ, గణేష్, సీనియర్ నాయకులు లంకా రమేష్, అడబాలు నాగు, పొట్నూరు జనార్దన్, తెర్లాం మండల సీనియర్ నాయకులు చందాక ఉమా మహేష్, ఆర్.కె నాయుడు, ఎందువ సత్యన్నారాయణ, ఆర్పి రాజు, అబోతుల రాజు, శ్రీనివాస్, కొరగంజి సాయి, సింబు, నవీన్, అక్కివారపు ప్రసాద్, శ్రీను, రాము, గేద్ద రమేష్, రఘు, మండల కమిటీ సభ్యులు, వివిధ మండల అధ్యక్షలు, వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.