నిరుపేద మహిళ వివాహానికి జ్యోతుల శ్రీనివాసు ఆర్థికసహాయం

పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన మురమళ్ళ మరియ్యమ్మ, నాగేశ్వరరావు(లేటు)ల కుమార్తె వివాహం నిమిత్తం ఆర్థికసహాయాన్ని పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ను కలిసి తమ కుమార్తె వివాహ నిమిత్తం ఆర్థిక సహాయం చేయవలసిందిగా కొరగా బుధవారం జ్యోతుల శ్రీనివాసు చేబ్రోలు గ్రామ జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి మురమళ్ళ మరియమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబానికి జ్యోతుల శ్రీనివాసు తగు ఆర్థిక సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు గ్రామ జనసేన నాయకులు దమ్ము చిన్న, అల్లం దొరబాబు, ఓరుగంటి నాగేశ్వరరావు, గంటా గంగబాబు, గుండేపల్లి మణికంఠ, దిబ్బడి సురేష్, బుద్దాల వెంన్న తదితరులు పాల్గొన్నారు.