సత్య ప్రసన్న కాలనీలో జనసేన ముస్లిం సచార్ యాత్ర

కాకినాడ సిటీ: జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాలపై స్థానిక 32వ డివిజన్ సత్య ప్రసన్న కాలనీలో శనివారం ముస్లిం సచార్ యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మొయినుద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లింల పరిస్థితులు సామాజిక ఆర్థిక స్థితిగతులు మారాలంటే జనసేన ప్రభుత్వమే రావాలని, జస్టిస్ రాజ్ రాజేంద్ర సచార్ కమిటీ ప్రతిపాదించిన సూచనలను అమలు చేస్తానని తన మేనిఫెస్టోలో ఆ అంశాలను ఉంచడం ద్వారా ముస్లింలకు మేలు చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నేడు ముస్లింలు సామాజిక ఆర్థిక అసమానతతో ఇబ్బందులు పడుతున్నారని వారి జీవన విధానం మెరుగుపడాలంటే సచార్ కమిటీ సిఫార్సులను అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. కమిటీ సిఫార్సులలో ముఖ్యంగా ముస్లిం మహిళలకు విద్య ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా వారి యొక్క బ్రతుకులను మార్చడానికి అవకాశం ఏర్పడుతుందని ముస్లిం బాలిక విద్యను పెంచాలి అంటే ముస్లిం పాఠశాలలను ఉర్దూ పాఠశాలలను మెరుగుపరిచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందని కానీ నేడు వైసీపీ ప్రభుత్వంలో ఉర్దూ పాఠశాలను సామాన్య పాఠశాలలతో అనుసంధానం చేయడం ద్వారా ముస్లింలు విద్యలో వెనుకబడుచున్నారని ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ పోస్టులను భర్తీ చేయడం లేదని విమర్శించారు. జనసేన ప్రభుత్వం మాత్రమే ముస్లింలకు న్యాయం చేస్తుందని అందుకు ఉదాహరణగా సచార్ కమిటీ సిఫార్సులను మేనిఫెస్టోలో చేర్చడమే కారణమని అన్నారు. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడడం తధ్యమని అందుకు ముస్లింలు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మొయినుద్దీన్, షేక్ ఇమాం, సయ్యద్ బాజీ, ఎస్.కె బాషా, ఎస్.కె బషీర్, ఎస్.కె నగీనా, తాహెరా, షహనాజ్ తదితరులు పాల్గోన్నారు.