పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జ్యోతుల శ్రీనివాసు

  • 67వ అంతర్ జిల్లాల సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ 2023-2024 క్రీడాకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపకఅధ్యక్షులు & జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం నియోజవర్గం: 67వ అంతర్ జిల్లాల సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్ 2023-2024 గేమ్స్ పిఠాపురం నియోజవర్గం పిఠాపురం పట్టణంలో గల ఆర్.ఆర్.బి.హెచ్ స్కూల్ నందు జరుపబడుతున్నాయి. సదరు కార్యక్రమానికి గురువారం క్రీడలకు హాజరైన జ్యోతుల శ్రీనివాసు కు ముందుగా గేమ్ కడప వర్సెస్ అనంతపురం జట్టుల క్రీడాకారులను హెచ్.ఎం సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్లు పరిచయం చేశారు‌. గేమ్ ను ప్రారంభం చేసి అనంతరం జరిగిన సభ కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాసు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని, విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ కలిగి ఉండి విద్యతో పాటుగా క్రీడలను కూడా అలవర్చుకోవాలని, దీని కారణంగా విద్యార్థులలో శారీరకంగా, మానసికంగా వారిలో మంచి ఎదుగుదల వస్తుందని అదేవిధంగా క్రీడల పట్ల మక్కువను చూపిస్తే అంతర్జాతీయంగా భారతదేశ పేరు ప్రతిష్టలు క్రీడారంగంలో బాగా పేరు వస్తుందని, కాబట్టి ప్రతి విద్యార్థిని, విద్యార్థి కూడా చదువుతోపాటుగా క్రీడలపై కూడా శ్రద్ధ చూపవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆయన సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల పట్ల మక్కువ ఉన్న విద్యార్థినీ విద్యార్థులను దాతలు వారిని క్రీడదత్తత తీసుకుని విద్యార్థులకు మక్కువ తగ్గట్టుగా తగు వసతులు, అవకాశాలను కల్పించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానంతరం క్రీడ నిర్వాహకులు జ్యోతుల శ్రీనివాసుని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి వి ఏ వి రామకృష్ణ, పిడీ లు మంగయ్యమ్మ, గట్టు సుధాకర్, దండాల ప్రసన్న, జనసేన నాయకులు జ్యోతుల సీతారాంబాబు, మేడిబోయిన సత్యనారాయణ, కోలా నాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం బేతెస్ధ బాప్టిస్టు సంఘం నూతన మందిర ప్రతిష్ట ఆరాధన, 25వ సంఘ వార్షికోత్సవం కార్యక్రమాల్లో శుక్రవారం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు పాల్గొన్నారు. పిఠాపురం మండలం, నరసింగపురం గ్రామములో గల బేతెస్ట బాఫ్టిస్టు సంఘం, సంఘ కాపరి పి వీరబాబు మరియు సంఘపెద్దల ఆహ్వానం మేరకు జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు
నరసింగపురం గ్రామానికి వెళ్ళి బేతెస్ట బాఫ్టిస్టు సంఘం వారి నూతన మందిర ప్రతిష్ట ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, 25వ సంఘ వార్షికోత్సవము నందు పాల్గొన్నారు‌‌. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ సంఘ ఆరాధన నూతన మందిరం చక్కగా నిర్మించుకున్నారని, అదేవిధంగా 25వ సంఘ వార్షికోత్సవము నందు పాల్గొనడం నాకు చాలా సంతోషకరంగా ఉందని, కావున సంఘ విశ్వాసులు, సంఘ పెద్దలు అందరూ కూడా బైబిల్ యొక్క నియమావళిని సక్రమంగా అనుసరించి, నిజజీవితంలో మంచిజీవనం కొనసాగించాలని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు. సంఘీకులను ఆయన కోరారు.అనంతరం సంఘ కాపరి పి వీరబాబు మరియు సంఘపెద్దలు జ్యోతుల శ్రీనివాసును ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సంఘకాపరి పి వీరబాబు, బీబీసీ చర్చి రవికుమార్, అడ్వకేట్ రెడ్డిపల్లి సీతపల్లి నారాయణరెడ్డి, కొంగు నూకరాజు, మోతు జార్జిబాబు, విజ్జనకాటమరాజు, ముంజవరపు అర్జునుడు, శ్యామ్ వీరబాబు, సుకుమార్, ఇజ్జన చలపతి, మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల సీతారాంబాబు, కొలా నాని తదితరులు ఉన్నారు.