పుస్తక పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం, గొల్లప్రోలు మండలం దుర్గాడగ్రామం నందు జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో దుర్గాడ గ్రామంలో పుస్తక పంపిణీ కేంద్రాన్ని జనసేన నాయకులు, సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఈ యొక్క పుస్తక పంపిణీ కేంద్రానికి నెలకు 3000 రూపాయలు ఇచ్చి గౌరవ వేతనంతో పుస్తక నిక్షిప్త కేంద్ర కేర్ టేకరిని నియమించారు. కేంద్ర కేర్ టేకరికి జిల్లా గ్రంథాలయ సంస్ధ వారు ఇచ్చే గౌరవవేతనం సరిపోదనే కారణంగా కేంద్ర కేర్ టేకరికి అదనంగా జ్యోతుల శ్రీనివాసు ప్రతి నెల తన సొంత నిధులు రూ:2000/-అక్షరాల రెండువేల రూపాయిలు(సంవత్సరానికి 24000/-అక్షరాల రెండు లక్షల రూపాయిలు) చెల్లిస్తానని హామి ఇచ్చారు. పుస్తక పంపిణీ కేంద్రానికి బిల్డింగ్ సదుపాయం లేకపోవడం వల్లన సాయిప్రియసేవాసమితి ద్వారా జ్యోతుల శ్రీనివాసు భవనంను+ప్రతి నెల కరంటుబిల్లు, త్రాగునీరు, రూపాయలు 2,00,000/- అక్షరాల రెండులక్షల రూపాయిలు విలువ కల్గిన దుర్గాడ పుస్తకాలను పంపిణీ కేంద్రానికి డొనేషన్ గా ఇవ్వడమైనదని. ప్రభుత్వం వారు దుర్గాడ గ్రామంలో ఉప గ్రంథాలయమును ఏర్పాటు చేసినట్లయితే సదరు కార్యాలయానికి కూడా మేము వసతి సౌకర్యం ఇతర అవసరాలకు వసతులు కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కేంద్రంనందు ఇప్పటికే పుస్తక అరమరలు, ఇతరపుస్తకాలను సాయిప్రియ సేవాసమితి సమకూర్చడం జరిగిందని కావున దుర్గాడ గ్రామప్రజలు, దుర్గాడ పరిసర గ్రామాల ప్రజలు, విద్యార్థులు పోటీ పరీక్షలకు హజరయ్యే వారు ఈ గ్రంథాలయం నందు పుస్తకములు చదివి సద్వినియోగపర్చుకోవాల్సిందిగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దుర్గాడ గ్రామ పుస్తక పఠన కేంద్ర కేర్ టేకరి ఎం.అనంత లక్ష్మి, రావుల తాతారావు, పంపన బావనర్సి, మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల వాసు, వడ్లమూరి నాగేశ్వరరావు, కీర్తి చిన్న జ్యోతులు గణపతి, జ్యోతుల శివశంఖర్, బొమ్మిడి సత్యనారాయణ, విప్పర్తి కృపాకర్, విప్పర్తి శ్రీను, విప్పర్తి సాలమన్ తదితరులు పాల్గొన్నారు.