జనసైనికుడి కుటుంబానికి అండగా కదిరి శ్రీకాంత్ రెడ్డి

  • ఘనంగా శ్రీకాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
  • జనసేన పార్టీలో చేరిన నందలపాడు యువత

అనంతపురం జిల్లా: తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి తాడిపత్రి పట్టణంలోని పాతకోటలో నివాసం ఉండే జనసైనికుడి అవ్వకి ఆరోగ్య సమస్యల కారణంగా కాలు తీసివేసిన సంగతి తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, పట్టణ కమిటీ నాయకులు మరియు పాతకోట జనసైనికులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నందలపాడు యువత జనసేన పార్టీలో చేరడం జరిగింది. జనసేన శ్రీకాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగినవి.