కోండమెలగాం గ్రామ ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటీ..!!

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కోండమెలగాంగ్రామ చెరువులో ప్రజలతో పవన్ రావాలి పాలనా మారాలి.. మార్పు కోసం ఎచ్చెర్ల నియోజకవర్గం సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్, జనసేన పార్టీ నాయకులుకరిమజ్జి మల్లీశ్వారావు మరియు జనసేన పార్టీ నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు శనివారం ప్రజలను కలిసి ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం తప్పిదాలు ప్రజలకు తెలియజేస్తూ.. అలాగే ఇంతవరకు ఉపాధి కూలీ నగదు ఎకౌంటులో జమ కాలేదని మేము ఎలా బ్రతకగలము ప్రజలు వాపోయారు. కోండమెలగాం గ్రామ ప్రజలకు ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వాలని అలాగే.. జనసేన పార్టీ సిద్దాంతాలను మరియు మేనిఫెస్టో గురించి చెబుతూ ఈసారి జనసేన పార్టీ అధికారం లోనికి వచ్చినట్లయితే గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, తెల్లరేషన్ కార్డుకు ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, రేషన్ బదులుగా మహిళల ఖాతాల్లో రూ”2500-3500/-వరకు నగదు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలను మరియు ఆచరించే విధానాలను ప్రజలకు కరిమజ్జి మల్లీశ్వారావు వివరించితిరి. టిడిపి, వైసీపీ ప్రభుత్వ పాలన చూశారు.. ఒక్కసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ పాలన కూడ ప్రజలు చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నటు వంటి పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని కరిమజ్జి మల్లీశ్వారావు మరియు పోట్నూరు లక్ష్మునాయుడు కోరారు. ఈకార్యక్రమంలో కోండమెలగాం గ్రామ పెద్దలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.