క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కదిరి శ్రీకాంత్ రెడ్డి

కదిరి: జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 10 నుంచి 28 వ తేది వరకు చేపట్టిన మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి సయ్యద్ రసూల్ ఆధ్వర్యంలో పట్టణంలోని పాతకోట కాలనీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు పాతకోట కాలని వాసులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఇంఛార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి పట్టణ అద్యక్షులు నరసింహ చారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి రసూల్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు గురించి కాలనీ వాసులకు వివరించారు. అదేవిదంగా కాలనీలో నెలకొన్న సమస్యలని శ్రీకాంత్ రెడ్డి కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కదిరి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతు ప్రజలకు ఎంతో మేలు చేసే మంచి కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు గురించి తెలియజేస్తూ మనలో చాలమంది రోజు కూలి పని చేసి జీవనం సాగిస్తున్నామని, క్రియా శీలక సభ్యత్వం చేసుకోవడం వల్ల మనకు, మన మీద ఆధారపడిన కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే 50 వేల రూపాయల వరకు, దురదృష్టవశాత్తూ ఒకవేళ మరణం సంభవిస్తే 5 లక్షల వరకు పార్టీ తరపున సహాయం చేసి ఆ కుటుంబాన్ని జనసేన పార్టీ ఆదుకుంటుందని కాలని వాసులకు వివరించి సభ్యత్వం చేపించడం జరిగింది. అదేవిధంగా కాలనీలో ఉన్న సమస్యల గురించి కాలనీ వాసులు శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకు రావడంతో ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా పట్టణ అధ్యక్షులు నరసింహచారి మాట్లాడుతు సభ్యత్వ నమోదు అందరూ చేసు కోవాలని అదేవిదంగా కాలనీలో వున్న సమస్యలు వీలైనంత త్వరగా శ్రీకాంత్ రెడ్డి ద్వారా పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు హర్షద్అయుబ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండా శివ, మణికంఠ మరియు పట్టణ కమిటీ నాయకులు శ్రీహరి, రాహూల్, ఇమాంవలి, కార్య నిర్వాహక కమిటీ సభ్యులు అల్తాఫ్, కార్యకర్తలు గైబుసా, హాజీ, షేక్షా, అలీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.