కొండపల్లి గ్రామంలో పర్యటించిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి: పెద్దవడుగూరు మండలం, కొండపల్లి గ్రామంలో జనసైనికుల ఆహ్వానం మేరకు తాడపత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి హాజరై గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దవడుగూరు మండల ఇన్చార్జ్ దూద్ వలి మరియు పెద్దవడుగూరు మండల నాయకులు తాడిపత్రి పట్టణ కమిటీ నాయకులు మరియు జనసైనికులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.