సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న కాజల్‌

కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ ఇటీవలే ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.  పెళ్లి తర్వాత కాస్త విరామాన్ని తీసుకోవాలని భావించినప్పటికీ.. ముందస్తు సినిమా కమిట్‌మెంట్స్‌ను నిర్లక్ష్యం చేయకుండా సినిమా షూటింగ్‌లో పాల్గొనాలని కాజల్‌ అగర్వాల్‌ నిర్ణయించుకుందట. ఆమె కథానాయికగా తమిళంలో ‘హే సినామికా’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్నాడు. సినిమా చిత్రీకరణను ఇటీవలే పునఃప్రారంభించారు. పదో తేదిన కాజల్‌ అగర్వాల్‌ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నదని చిత్ర బృందం ప్రకటించింది. పెళ్లి తాలూకు హంగామా నుంచి ఇంకా తేరుకోకముందే వృత్తిపట్ల తన కమిట్‌మెంట్‌ను తెలియజేసేలా కాజల్‌ అగర్వాల్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నదని ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.