మత్స్యకారులకు మద్దతు తెలిపిన కాకినాడ సిటీ జనసేన

కాకినాడ సిటి, జనసేన పార్టీ ముత్తా శశిధర్ సూచనలమేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య నాయకత్వంలో సముద్ర తీర ప్రాంతంలోని కుంభాభిషేకం ఏరియాలో నిరసన తెలిపే కార్యక్రమం నిర్వహించడం జరిగినది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలని చూసి జనసేన పార్టీ కాకినాడ సిటి శ్రేణులు స్థానిక మత్స్యకారులకు మద్దతుగా వారికి జరుగుతున్న అన్యాయాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు. వాస్తవానికి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి స్థానిక మత్స్యకారులకు అవసరమైన మౌళిక సదుపాయాలని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో అప్పటి శాశనసభ్యులు ముత్తా గోపాలకృష్ణ ఆధ్వర్యంలో శంఖుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులకు అంకురార్పణ చేయడం జరిగింది. కాలక్రమంలో రాజశేఖర్ రెడ్డి దుర్మరణం, ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ దీనిపై దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. తదనంతర పరిణామాలలో వై.సి.పి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా దివంగత రాజశేఖర్ రెడ్డి శంఖుస్థాపన చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు దానిని ఇంకెవరికొ కట్టబెట్టడాన్ని జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నామని జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య అన్నారు. తెలుగుదేశం, వై.సి.పి పార్టీలు రెండూ రాజకీయాలు చేస్తూ మత్స్యకారులకి అన్యాయం తలపెట్టడం జనసేన పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. కనీసం దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం ఉంటే జగన్ అయినా ఆయన తనతండ్రి వేసిన శిలాఫలకానికి గౌరవం ఇచ్చి పనులు పూర్తిచేసి ఆయన గౌరవం నిలబెట్టాలిసిందిగా డిమాండ్ చేసారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదార్శి తలాటం సత్య, కాకినాడ సిటి ఆర్గనైజర్ మడ్డు విజయ్ కుమార్, దుమ్ములపేట జనసేన నాయకులు పేర్ల అమర్నాధ్, మోసా ఏసేబు, వీరబాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.