దుల్హన్ పధకం నిలిపివేసినందుకు కాకినాడ సిటి జనసేన నిరసన

కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు, కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆధ్వర్యంలో దుల్హన్ పధకంలో ముస్లిం మహిళలకు ఇస్తానన్న మొత్తాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం స్థానిక జగన్నాధపురంలోని జె.రామారావుపేట మశీదు వద్ద శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరిగినది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఎన్నికలవేళ పేద ముస్లిం యువతుల వివాహానికి దుల్హన్ పధకాన్ని మరింత పెద్ద ఎత్తున ఎక్కువమొత్తాన్ని ఇస్తానని చెప్పి, ఇప్పుడు ఇవ్వకుండా మోసంచేస్తున్న వై.ఎస్.ఆర్ పార్టీని ముత్తా శశిధర్ తప్పుపట్టారు. ఇటువంటి చర్యలవల్ల ముస్లిం వర్గం తీవ్రంగా నష్టపోతుందని, ఆశలు కలిపించి ఇలా దగా చేయడం దారుణమన్నారు. తక్షణమే ఈపధకాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాదు, సయ్యద్ మొయీన్, సమీర్, కశ్మీరు ఖాన్, మహమ్మద్ షమ్మీర్, ఎం.డి. సుబానీ, రఫీజ్, కాజా మరియు పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు వారితో పాల్గొనగా వారికి మద్దతుగా ఈ కార్యక్రమంలో సహచర పి.ఏ.సి సభ్యులు పంతం నానాజి పాల్గొనగా, నగర అధ్యక్షులు సంగిశెట్టి అశోక్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి బడే కృష్ణ, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.