శ్రమదానం చేసిన కాకినాడ జనసేన

కాకినాడ రూరల్, ప్రజా అవసరాలను ముందుగా తెలుసుకుని వాటిని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నామని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల పట్ల శ్రద్ద చూపకుండా పథకాలకి, భవనాలకి పేర్లు మార్చుకోవడానికి, భూకబ్జాలు, దందాలపైన ద్రుష్టి పెట్టి అభివృద్ధిని గాలికి వదిలేసిందని, జనసేన పార్టీ జనసైనకులు ప్రజలకు ఉపయోగకరమైన వాటిని వారి శక్తికి మించి చేస్తున్న వారిని అభినందనలు తెలిపిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ. కాకినాడ రూరల్ మండలం సూర్యాపేట గ్రామపంచాయతీ పరిధిలోవాకలపూడి నుండి ఉప్పాడ వెళ్లే తొమ్మిదవ మైలురాయి వద్ద ఉన్న బ్రిడ్జికి ఆనుకుని ఉన్న మలుపు వద్ద ముళ్ల కంపలు పెరిగిపోవడంతో అనేక మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని పోలవరం గ్రామం జనసేన పార్టీ అధ్యక్షుడు హరి ఆధ్వర్యంలో జెసిబితో ముళ్ళ కంపలు తొలగించే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ పీఏసీ సభ్యులు పంతం నానాజీ పాల్గొని శ్రమదానం చేసారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల పేర్లు మార్చడం, ప్రాంతాల మధ్య విభేదాలు పనిలో నిమగ్నమై ప్రజా అవసరాలను విస్మరిస్తోందని విమర్శించారు. ఈ ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని బీచ్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ముళ్ళకంపలను స్వచ్ఛందంగా తొలగించే కార్యక్రమం చేపట్టిన పోలవరం గ్రామ అధ్యక్షులు హరికి, జనసైనికులకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంపీటీసీ ఓసుపల్లి రాజేశ్వరి రాము, నాయకులు కరెడ్ల గోవిందు, శిరంగు శ్రీను, మాదారపు తాతాజీ, గరికన సురేష్, మల్లె భాస్కర్, సోదే ముసలయ్య, నూకల నారాయణ రావు, తాటికాయల వీరబాబు, దాసరి శివ, పోసిన రాము, త్రిమూర్తులు, నందిపాటి రమణ, బాబీ, రామకృష్ణ, వేణు, శ్రీనివాస్, రమణ, రాజు, శివకిషోర్, సంతోష్, దొరబాబు, చిన్నారావు, సతీష్, జీనిశ్రీనూ, శరత్, బాబీ, రామకృష్ణ, రమణ, స్వామి, కిషోర్, ప్రసాద్, బుజ్జి, సాన శ్రీను, శివతేజ, శాండీ తదితర జనసైనికులు పాల్గొన్నారు.