స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత చెత్తపరిపాలన ఎవ్వరూ చేయలేదు -బండారు శ్రీనివాస్

  • తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జనసేన ఇంఛార్జి బండారు శ్రీనివాస్

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వం కొత్తపేట నియోజకవర్గం ఇంఛార్జి బండారు శ్రీనివాస్ తనదైన శైలిలో చురకలు వేశారు. తిరుపతి లడ్డు, ఇసుక, మట్టి, మద్యం, ప్రజలకు సంబంధించిన అన్నింటిలో అవినీతికి పాల్పడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఒక్కటే అని అన్నారు. జనసేన పార్టీ పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని, మీరు మట్టి తవ్వి కాలనీలకు 10 లారీలు తరలించి బయట మీ సొంత వ్యాపారాలకు 90 లారీలు పంపుకుంటున్న శాసన సభ్యులపై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆలమూరు మండలం ఈ నియోజకవర్గంలో కలవక ముందు 2002లో దివంగత నేత వివిఎస్ చౌదరి 1.5 సెంట్ల చొప్పున 8 ఎకరాలు ఆలమురు ఎర్రకాలనీకి భూమిని కేటాయిస్తే దానిని ఇప్పుడు 1.25 సెంట్ల చొప్పున చేసి వాటికి జగనన్న కాలనీలుగా పేరు పెట్టడం హస్యాస్పదంగా ఉంది అని ఏద్దేవా చేశారు. మడికి నుండి నాలుగు కిలో మీటర్లు దూరంలో ఉన్న 10 ఎకరాలు భూమిలో చిపడు మట్టి వేసినటగానీ, లేఅవుటు వేసింది లేదు అని, పక్కన “ప్రక్కన ఉన్న దళితులు భూమి 4 ఎకరాలు 47 సెంట్లు బ్రిటిష్ 1 కాలం భూమిని లాకోవడం నిజం కాదా? దళితు కోర్టుకి వెళ్ళడం నిజం కాదా? అని ప్రశ్నించారు. కొత్తపేట మండలంలో నియోజకవర్గానికి శివారు అయిన చిన్నలంకలో కొత్తపేట ప్రజలకు 10 కి.మీ దూరంలో భూమి సేకరించి ఇప్పటికి దానిని పట్టించుకున్నారా? అనిడి గ్రామం ఉచ్చుల వారి పేటలో ప్రక్కనే19 ఎకరాలు పల్లపు భూమి సేకరించిచారు. దానికి రొయ్యలు చెరువులకు ఇచ్చి అక్కడ ఉప్పు నీటితో కలుషితం అయ్యే విధంగా కాలనీలు, ప్రక్కన ఉండటం నిజం కాదా? ఇక్కడ మంచి నీరు పడాలి అంటే 350 అడుగుల లోతుకు బోరు వేస్తుకాని వేసే పరిస్థితి. ఇవి అన్ని పక్కన పెడితే ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సొంత గ్రామం గోపాలపురంలో 35 ఎకరాలు భూమి కేటాయించి ఇప్పటికి అందులో ఎక్కడా ఇళ్ళు కానీ, రోడ్లు కాని వేసినట్లు చూపించగలరా? అని ఏమి మీకు కనిపించడం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. మీ ఊరులో మీరు 35 ఎకరాలలో ఇళ్ళు కట్టినట్ల చూపించగలరా? మీరు చూపిస్తాను. అంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఛాలెంజ్ ని స్వీకరిస్తారా? అని సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో తాళ్ల డేవిడ్, సంగీత సుభాష్, చేకూరు కృష్ణంరాజు, దొంగ సుబ్బారావు, బొక్క ఆదినారాయణ, మహాదశ బాబులు, తోట స్వామి, గారపాటి త్రిమూర్తులు, ఎర్రంశెట్టి రాము కొత్తపల్లి నగేష్, జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు.