జనసేనాని పిలుపే మాకు రామబాణం: కలవచర్ల హెల్పింగ్ హాండ్స్ యూత్ జనసైనికులు!

  • జనసేనాని పిలుపే! మాకు రామబాణం! వరద బాధితులకు మేము సైతం! కలవచర్ల హెల్పింగ్ హాండ్స్ యూత్ జనసైనికులు!
  • ఆలమూరు మండలం బడుగు వాణి లంక గ్రామం గోదావరి వరద బాధితులకు ఆహారము 4000 పులిహార పొట్లాలు పంపిణీ చేసిన కలవచర్ల హెల్పింగ్ హాండ్స్ యూత్ జనసైనికులు! జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, కలవచర్ల యూత్ సభ్యులకు అభినందనలు!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలంలోని, బడుగువాని లంకలో గత వారం రోజుల నుంచి వరదలు గురించి అనేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం, గోదావరి వరదల వల్ల ఆకలి బాధలను దిగమింగు కుంటున్న వరద బాధితులకు, మేమున్నామని, జనసేనాని పిలుపుపై నాలుగు వేల పులిహార ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను, ఈరోజు బడుగు వానిలంక గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి సరఫరా చేసి తమ మానవత్వాన్ని చాటుకున్న కలవచర్ల జనసేన హెల్పింగ్ హాండ్స్ యూత్ సభ్యులు! ఈలాంటి గొప్ప కార్యక్రమం చేస్తున్న నందులకు వారిని, కలవచర్ల గ్రామస్తులతో పాటు, బడుగువాణి లంక గ్రామంలో ఉన్న ప్రతి ఇంటింటికి చెందిన ప్రతి ఒక్కరూ, కలవచర్ల జనసేన పార్టీ హెల్పింగ్ హాండ్స్ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. ఇలాంటి సహృదయము, మానవత్వము ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని, సాటివారికి కష్టం, ఆపద వస్తే, మేమున్నామనే భరోసానివ్వాలని, ప్రతి ఒక్కరిలోని ధైర్యం నింపాలని, ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కలవచర్ల గ్రామ జనసేన హెల్పింగ్ హాండ్స్ యూత్ సభ్యులను ఆలమూరు మండల ప్రజలు దీవిస్తూ ఆశీర్వదించారు. ఇటువంటి కార్యక్రమం చేయడం మా జన సైనికులుగా, కలవచర్ల జనసేన యూత్ వారిని, అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో వరద బాధితులకు సేవలు అందిస్తున్న మా జన సైనికులకు,మా కార్యకర్తలకు కూడా ఎంతో రుణపడి ఉంటానని, మా జన సైనికులంతా, జనసేనాని పవన్ కళ్యాణ్ వారి అడుగుజాడల్లో నడుస్తూ, వారి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడం అది నా అదృష్టంగా భావిస్తున్నానని, నా జన సైనికులు చేసే సాయం ఎప్పటికీ మర్చిపోలేనని, ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. నా జన సైనికులు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పడాల అమ్మిరాజు, శ్రీ రాములు, వడ్డే నాగేంద్ర శ్రీనివాస్, వడ్డే రామాంజనేయులు, గానుగుల సాయిరాం, దాసరి హరీష్, దాసరి తేజ, గానుగుల జగదీష్, పెద్దిరెడ్డి రమేష్ తేజ, వడ్డే వికాస్, చీకట్ల సజ్జన రాజు, బండారు శీను, జోల మణికంఠ, కొట్టు జానకి రామయ్య గంగవరపు ప్రసాద్, గవర పు మణికంఠ, చిన్న ట్ల పుల్లయ్య నాయుడు, వడ్డే సత్యనారాయణ (బాబి) గొల్లపల్లి మణికంఠ, సురేంద్ర, (సత్యవతి), సింగన రవి,(పెనికేరు), కొట్టు శివరాజు, వడ్డే వెంకటేశ్వర్లు, (బుద్ధుడు), చిన్నటి సతీష్, గానుగుల అర్జునరావు, వాడ వెల్ల సుధీర్ కుమార్, బండారు సాయిరాం, ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.