మహాదేవపూర్ జనసేన మండల అధ్యక్షుడిగా కాల్వ రాజశేఖర్

మంథని: తెలంగాణలో జనసేన పార్టీని ప్రజల్లోకి బలోపేతం చేయడానికి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మహాదేవపూర్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా కాల్వ రాజశేఖర్ ను నియమిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో మంథని నియోజకవర్గ ఇన్చార్జ్ మాయ రమేష్ తెలిపారు. తమ నియమాకానికి సహకరించిన కమిటీ సభ్యులందరికీ పేరుపేరునా ప్రత్యేకమైన ధన్యవాదములు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తెలంగాణరాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, మంథని నియోజకవర్గం ఇంచార్జ్ మాయ రమేష్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహాదేవపూర్ మండలంతో పాటు మంథని నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని కాల్వ రాజశేఖర్ తెలిపారు.