పొన్నలూరు విద్యుత్ అధికారికి ధన్యవాదాలు తెలిపిన కనపర్తి మనోజ్ కుమార్

  • అధికారులు ప్రజలకు మంచి పనులు చేస్తే, ధన్యవాదాలు తెలపడం పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించిన సంస్కారం

కొండపి నియోజకవర్గం: పొన్నలూరు మండలంలో పైరెడ్డిపాలెం గ్రామంలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం ఉంది, ప్రజలకు ప్రాణ నష్టం జరుగుతుంది అని విద్యుత్ అధికారి రమేష్ బాబు గారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది, రమేష్ బాబు గారు వెంటనే స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను మార్చి, కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది, విద్యుత్ అధికారులకి జనసేన పార్టీ మరియు పైరెడ్డిపాలెం గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ప్రజల కోసం ప్రజల తరఫున జనసేన పార్టీ అధికారులను ప్రశ్నిస్తుంది, ప్రజలకు మంచి జరిగితే ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం, ఇది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించిన సంస్కారం అని కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నలూరు జనసేన నాయకులు పిల్లిపోగు పీటర్ బాబు, కర్ణ తిరుమలరెడ్డి, పెయ్యల రవికుమార్ యాదవ్, షేక్ ఖాదర్ బాషా, షేక్ మహబూబ్ బాషా, సుంకేశ్వరం శ్రీను, ఆంజనేయులు, వెంకట్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.