కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్యని మర్యాదపూర్వకంగా కలిసిన జానీ మాస్టర్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలలో కాపు సంక్షేమసేన అధ్యక్షులు హరిరామ జోగయ్య నిర్ణయాలను సూచనలను పరిగణలోకి తీసుకున్న పరిస్థితుల్లో ఇటీవల కాపు సంక్షేమ సేన తరపున రాష్ట్రం మొత్తం మీద అవకాశం ఉన్న ఆశావాహుల పేర్లు ప్రకటించిన విషయం విధితమే. శుక్రవారం పాలకొల్లులో వారిని మర్యాద పూర్వకంగా వారిని, జనసేన పిఎసి మెంబర్ చేగుండి సూర్య ప్రకాష్ ని కలిసి నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సుదా మాధవ్ ఆధ్వర్యంలో జానీ మాస్టర్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జనసేన పార్టీ సుళ్ళూరు పేట ఇన్చార్జ్ ప్రవీణ్, కావలి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పని చేసేందుకు సిద్ధంగా ఉన్న రవీంద్ర, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుదీర్ బద్దిపూడి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, కాపు సంక్షేమ సేన ప్రధాన కార్యదర్శి కొణిదల సందీప్ తదితరులతో చర్చించి తమ విలువైన సందేశాలను సూచనలను ఇచ్చారు. కాపు సంక్షేమ సేన నాయకుల ఆధ్వర్యంలో ఆశావాహుల పేర్లు పరిశీలించి పైకి పంపడం వరకే నా వంతు, తుదినిర్ణయం పవన్ కళ్యాణ్ దేనని, నిర్ణయం ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ ను గెలిపించేందుకు మీరందరూ కలిసిమెలిసి కష్టపడి పని చేయాలని సూచించారు.