శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవిని మర్యాదపూర్వకంగా కలిసిన భవన నిర్మాణ కార్మికులు

నందిగామ పట్టణంలోని జనసేన కార్యాలయంలో నందిగామ భవన నిర్మాణ కార్మికుల సంఘం వారు నందిగామ జనసేన సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలను రమాదేవికి వివరంగా తెలియజేశారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ కార్మికులను వారి కష్టాలను అస్సలు పట్టించుకోవడంలేదని, కనీసం వారికి రావలసిన పథకాలేవి కూడా వాళ్లకు అందడం లేదని చెప్పి వాపోయారు. కరోనా సమయంలో వారికి పనులు ఉండేవి కావని, కనీసం ఆ సమయంలో ప్రభుత్వం ఆదుకుంటానని చెప్పి కనీస వేతనంగా పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వలేదని తెలియజేశారు. వారు ప్రతి సంవత్సరం యూనియన్ తరపున ప్రమాద భీమా కడుతున్నామని, గత నాలుగున్నర సంవత్సరం నుండి ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఆ భీమా అందడం లేదని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఇసుక దోపిడి పెరిగిపోయిందని, ఇసుక ధర, స్టీల్ ధర, సిమెంట్ ధర అన్ని పెరిగిపోవడం వల్ల ప్రజలు నిర్మాణాలు చేపట్టడం లేదని, అందువల్ల మాకు పనులు కూడా రావడం లేదని తెలియజేశారు. ఒక్క నందిగామ నియోజకవర్గంలో భవన నిర్మాణ కార్మికుల సంఘంలో గుర్తింపు కార్డు తీసుకున్న వారు 3000 పైచిలుకు ఉన్నారని, అనధికారికంగాగా ఇంకో 1500 మంది ఉన్నారని, వారిలో గత సంవత్సరం ఇక్కడ పనులు లేక సుమారు 2000 మంది పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారని తెలియజేశారు. అనంతరం రమాదేవి వారితో మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు జనసేన ఎల్లప్పుడు అండగా ఉంటుందని, రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల కోసం మొదటగా గళం వినిపించి, లాంగ్ మార్చ్ చేసిన నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని వారికి తెలియజేశారు. జనసేన-టిడిపి ఇరు పార్టీల ప్రభుత్వం స్థాపించిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని, మీరు అధర్యపడవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందిగామ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తురక రామస్వామి, ప్రధాన కార్యదర్శి ఎరగొర్ల నరసింహారావు, కోశాధికారి షేక్ బడే మియా, ఉపాధ్యక్షులు గొట్టముక్కల పెద్దరామయ్య, సంయుక్త కార్యదర్శి రామాల మైనర్ బాబు, గౌరవ అధ్యక్షులు షేక్ మస్తాన్, గౌరవ సలహాదారులు బలుసుపాటి సీతారామయ్య, నందిగామ మండల అధ్యక్షులు పొడుపుగంటి రామారావు, జనసేన నాయకులు సూరా సత్యనారాయణ పాల్గొన్నారు.