కేసీఆర్‌ దత్త పుత్రిక ప్రత్యూష వివాహ వేడుక

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్త పుత్రిక ప్రత్యూష వివాహ వేడుక నేడు (సోమవారం) ఘనంగా జరిగింది. క్రిస్టియన్‌ సంప్రదాయాల ప్రకారం ఉదయం 10 గంటలకు పాటిగడ్డ లూర్దుమాత ఆలయంలో ప్రత్యూష, చరణ్ రెడ్డిలు ఒక్కటయ్యారు.  క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం ఈ వివాహ వేడుక జరిగింది. ప్రత్యూష వివాహానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

ప్రత్యూష పెళ్లి క్రమంలో భాగంగా ఆదివారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఎఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో ప్రత్యూషను ముఖ్యమంత్రి సతీమణి శోభ పెళ్లి కూతురుని చేశారు. ప్రత్యూషకు ఈ సందర్భంగా శోభ డైమెండ్ నక్లెస్, పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించారు. సంప్రదాయ పద్దతిలో పెద్దలు ప్రత్యూషను ఆశీర్వదించి పెళ్లికూతురుని చేశారు.

కాగా, సవతితల్లి, తండ్రి వేదింపులతో ఆసుపత్రిలో ఉన్న ప్రత్యూషను సిఎం కెసిఆర్ దత్తపుత్రికగా స్వీకరించి నర్సు ట్రైనింగ్ చేయించి ప్రత్యూషకు నచ్చిన వరుడితో పెళ్లి జరిపించారు.